Home /News /jobs /

GOOD NEWS FOR STUDENTS INVITATION TO APPLY FOR ONLINE COURSES IN SWAYAM AS ALWAYS UMG GH

SWAYAM Registration: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్వయంలో ఆన్ లైన్ కోర్సుల దరఖాస్తులకు ఆహ్వానం.. ఎప్పటినుంచంటే !

 విద్యార్థులకు గుడ్ న్యూస్..  స్వయంలో ఆన్ లైన్ కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వానం.. ఎప్పటినుంచంటే !

విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్వయంలో ఆన్ లైన్ కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వానం.. ఎప్పటినుంచంటే !

స్వయం (SWAYAM) పోర్టల్‌పై అందించే 2022 జనవరి సెమిస్టర్ కోర్సుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు స్వయం వెబ్‌సైట్ swayam.nta.ac.in ద్వారా రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేయవచ్చు.

స్వయం (SWAYAM) పోర్టల్‌పై అందించే 2022  జనవరి సెమిస్టర్ కోర్సుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు స్వయం వెబ్‌సైట్ swayam.nta.ac.in ద్వారా రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేయవచ్చు. పరీక్ష ఫీజు తుది గడువు ఆగస్టు 5గా నిర్ణయించారు. అభ్యర్థులు క్రెడిట్ కార్డ్(Credit card), డెబిట్ కార్డ్(Debit Card), నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారమ్‌‌లో వివరాలను కరెక్షన్ చేయడానికి కూడా అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఇందుకు ఆగస్టు 7 నుంచి 10 వరకు సమయం కేటాయించారు. అయితే పరీక్ష తేదీలు ఇంకా వెల్లడికాలేదు. ఇందుకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) త్వరలో ఓ ప్రకటన చేయనుంది. యూజీసీ నోటీస్ ప్రకారం.. 348 కోర్సుల కోసం పరీక్షను.. రెండు రోజుల పాటు రెండు సెషన్లలో మూడు గంటల చొప్పున నిర్వహించనున్నారు. ఇందుకు ఎన్‌టీఏ దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

స్వయం అంటే..?
స్వయం (SWAYAM) పూర్తి పేరు ‘స్టడీ వెబ్స్‌ ఆఫ్‌ యాక్టివ్‌ లెర్నింగ్‌ ఫర్‌ యంగ్‌ ఆస్పైరింగ్‌ మైండ్స్‌’. ఇది ఒక ‘మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్స్‌’. దేశంలో అందరు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో 2017లో కేంద్ర విద్యాశాఖ దీన్ని ప్రారంభించింది. స్వయం పోర్టల్‌లో కోర్సులు అందిస్తున్న నేషనల్ కో-ఆర్డినేటర్స్ జాబితాలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (NIOS), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTR), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ (CEC), ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు (IIMB), నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్ (NPTEL) వంటి సంస్థలు ఉన్నాయి.

ఇదీ చదవండి: WhatsApp: వారెవ్వా వాట్సాప్.. రోజుకో కొత్త ఫీచర్లు.. ఇక ఎవరికి తెలియకుండా లెఫ్ట్ అయ్యే ఫీచర్.. ఎలాగో లుక్కేయండి !



అభ్యర్థులకు యూజీసీ కీలక సూచన చేసింది. స్వయం ప్లాట్‌ఫారమ్‌ ద్వారా నేషనల్ కోఆర్డినేటర్ సంస్థలు అందించే సెమిస్టర్ కోర్సుల కోసం నిర్వహించే పరీక్షలకు సంబంధించిన అప్‌డేట్‌ల కోసం ఎన్‌టీఏ వెబ్‌సైట్ nta.ac.inను తరచూ చెక్ చేస్తుండాలని పేర్కొంది.



మరోవైపు, ఇటీవల యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్‌లో అడ్మిషన్ల కోసం ఎక్కువ మంది విదేశీ విద్యార్థులను ప్రోత్సహించడానికి డిస్టెన్స్ లెర్నింగ్ నిబంధనల్లో మార్పులు చేసింది. 2020 రెగ్యులేషన్ ప్రకారం.. విదేశీ విద్యార్థులకు పాస్‌పోర్ట్ మాత్రమే చెల్లుబాటు అయ్యే ఐడెంటిఫికేషన్‌గా పరిగణించారు. అయితే ఇకపై యూనివర్సిటీలు ఫోటోగ్రాఫ్‌తో ఉన్న ఏదైనా జాతీయ గుర్తింపు కార్డును ఐడెంటిఫికేషన్‌గా పరిగణించనున్నాయి. అయితే విదేశీ వ్యవహారాల శాఖతో సంబంధం లేకుండా యూజీసీ గుర్తింపు పొందిన ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్‌లో అడ్మిషన్ పొందాలనుకునే విదేశీ విద్యార్థులు తప్పనిసరిగా పాస్ పోర్ట్‌ను ఐడెంటిఫికేషన్‌గా చూపించాల్సిందేనని యూజీసీ స్పష్టం చేసింది.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, National Testing Agency, Ncert, UGC

తదుపరి వార్తలు