హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JNV Admissions: విద్యార్థులకు గుడ్ న్యూస్ .. నవోదయలో అడ్మిషన్స్.. ఇలా దరఖాస్తు చేస్తే సీట్ మీదే !

JNV Admissions: విద్యార్థులకు గుడ్ న్యూస్ .. నవోదయలో అడ్మిషన్స్.. ఇలా దరఖాస్తు చేస్తే సీట్ మీదే !

 విద్యార్థులకు గుడ్ న్యూస్ .. నవోదయలో అడ్మిషన్స్.. ఇలా దరఖాస్తు చేస్తే సీట్ మీదే !

విద్యార్థులకు గుడ్ న్యూస్ .. నవోదయలో అడ్మిషన్స్.. ఇలా దరఖాస్తు చేస్తే సీట్ మీదే !

పదో తరగతి(10 th class) పూర్తి చేసిన విద్యార్థులకు అలర్ట్. జవహర్ నవోదయ విద్యాలయాల్లో పదకొండవ తరగతి అడ్మిషన్(Admission) ప్రక్రియ ప్రారంభమైంది. నవోదయ విద్యాలయ సమితి తన అధికారిక వెబ్‌సైట్‌లో JNV 11వ తరగతి ప్రవేశ ప్రక్రియను ప్రారంభించి, లాటరల్ అడ్మిషన్ ఫారమ్స్‌ కూడా విడుదల చేసింది.

ఇంకా చదవండి ...

పదో తరగతి(10th class) పూర్తి చేసిన విద్యార్థుల(Students)కు అలర్ట్. జవహర్ నవోదయ విద్యాలయాల్లో పదకొండవ తరగతి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నవోదయ విద్యాలయ సమితి తన అధికారిక వెబ్‌సైట్‌లో JNV 11వ తరగతి ప్రవేశ ప్రక్రియను ప్రారంభించి, లాటరల్ అడ్మిషన్ ఫారమ్స్‌ కూడా విడుదల చేసింది. 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inకి వెళ్లి అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. JNV 11వ తరగతి లాటరల్ ఎంట్రీ అడ్మిషన్‌కు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 18గా నిర్ణయించారు.

10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయాల్లో సైన్స్(Science), కామర్స్, ఒకేషనల్, హ్యుమానిటీస్ కోర్సులలో అడ్మిషన్ పొందవచ్చు. JNV 11వ తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా 1 జూన్ 2005 - 31 మే 2007 మధ్య జన్మించి ఉండాలి. ఈ వయోపరిమితి నియమం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్యార్థులతో సహా మిగతా అభ్యర్థులందరికీ వర్తిస్తుంది.

JNV అడ్మిషన్ 2022కి ఎలా దరఖాస్తు చేయాలి?

స్టెప్ 1: విద్యార్థులు మొదటగా నవోదయ అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inకి వెళ్లాలి.

స్టెప్ 2: హోమ్‌పేజీలో '2022-23 సెషన్‌లో Class XI Lateral Entry Admission కోసం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి′ అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

ఇదీ చదవండి: Grand Vitara: త్వరలో మారుతి సుజుకి మైండ్ బ్లోయింగ్ కారు లాంచ్.. లీక్ అయిన ధరల వివరాలివే..!


స్టెప్ 3: ఇప్పుడు ఒక కొత్త వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది.

స్టెప్ 4: ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ (Registration)పూర్తి చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

స్టెప్ 5: JNV 11వ తరగతి అడ్మిషన్ ఫారం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్టెప్ 6: ఫారమ్‌ను ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్‌ సబ్మిట్ చేయాలి.

స్టెప్ 7: సమాచారమంతా అందించిన తరువాత దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.

స్టెప్ 8: దరఖాస్తు ఫారమ్‌ను భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటవుట్ తీసుకోవాలి.

JNV 11వ క్లాసు కోసం అడ్మిషన్లకు రిజిస్టర్ చేసుకునేటప్పుడు.. విద్యార్థులు అనేక డాక్యుమెంట్స్ అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ లేటెస్ట్ ఫొటో, సంతకం, తల్లిదండ్రుల సంతకంతో సహా పదో తరగతి మార్కు షీట్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. XI తరగతిలో అడ్మిషన్లను భర్తీ చేయడానికి.. విద్యార్థులు 2021–2022 విద్యా సంవత్సరంలో X తరగతి బోర్డ్ పరీక్షలో వారి మార్కులను ఆధారం చేసుకుంటారు. ఆసక్తిగల విద్యార్థులు పదకొండవ తరగతి అడ్మిషన్ల కోసం త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది.

First published:

Tags: 10th Class Exams, Applications, JOBS, Navodaya

ఉత్తమ కథలు