Home /News /jobs /

GOOD NEWS FOR RRB GROUP D CANDIDATES HALL TICKETS ARE AVAILABLE ON THE WEBSITE DOWNLOAD IT VB

RRB Group D Update: ఆర్ఆర్బీ గ్రూప్ D అభ్యర్థులకు అలర్ట్.. అందుబాటులోకి హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ D రిక్రూట్‌మెంట్ రాత పరీక్షల తేదీలను ఇటీవల రైల్వే అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు.. సిటీ, ఎగ్జామ్ డేట్ కు సంబంధించి వివరాలను కూడా వెబ్ సైట్లో పొందుపరిచారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Secunderabad, India
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ D రిక్రూట్‌మెంట్ రాత పరీక్షల తేదీలను ఇటీవల రైల్వే అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు.. సిటీ, ఎగ్జామ్ డేట్ కు సంబంధించి వివరాలను కూడా వెబ్ సైట్లో పొందుపరిచారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. RRB గ్రూప్ D ఫేజ్ 1 పరీక్ష 17 ఆగస్టు 2022 నుండి 25 ఆగస్టు 2022 వరకు జరుగుతుంది. అయితే తాజాగా ఆగస్టు 17వ తేదీన పరీక్ష రాసే అభ్యర్థుల హాల్ టికెట్స్ ను అధికారులు వెబ్ సైట్లో పొందుపరిచారు. మిగిలిన అభ్యర్థుల హాల్ టికెట్స్ కూడా 4 రోజుల ముందు వెబ్ సైట్లో అందుబాటులో ఉండనున్నాయి.

Singareni Jobs For Sale: రండి బాబు రండి.. సింగరేణి జూనియర్ అసిస్టెట్ ఉద్యోగాలు అమ్మబడును..!


హాల్ టికెట్స్ ను ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

-మొదట అధికారిక వెబ్ సైట్ https://rrbsecunderabad.gov.in/ను సందర్శించండి.

-తర్వాత లెవల్ 1 పోస్టుల అప్ డేట్ పై క్లిక్ ఇవ్వండి.

-Click Here for Exam, City Slip for CBT Phase-1 అనే ఆప్షన్ ను ఎంచుకోండి

- దీనిలో రిజిస్ట్రేషన్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే.. అడ్మిట్ కార్డు వచ్చేస్తుంది.

- దానిని డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.



ఖాళీల వివరాలు..

ఈ ప్రక్రియ ద్వారా రైల్వేలో లెవల్ 1 కింద 1,03,769 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో జనరల్ కేటగిరీకి 42,355, షెడ్యూల్డ్ కులాల కేటగిరీకి 15,559, షెడ్యూల్డ్ తెగలకు 7,984, ఇతర వెనుకబడిన తరగతులకు 27,378, ఆర్థికంగా బలహీన వర్గాలకు 10,381 పోస్టులు ఉన్నాయి.

NMDC Recruitment 2022: NMDCలో ఖాళీలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు..

ఏ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు?

పేపర్ 100 మార్కులకు ఉంటుంది. దీనిలో నెగెటివివ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు. పరీక్ష 90 నిమిషాలు ఉంటుంది. ఇందులో జనరల్ సైన్స్ నుంచి 25, మ్యాథ్స్ నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాలంటే 40 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 40 శాతం, ఓబీసీకి 30, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం ఉండాలి. వీటిలో మెరిట్ సాధించిన వారిని పీఈటీకి పిలుస్తారు. దానిని విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులను తదుపరి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుకు పిలుస్తారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central Government, Central Government Jobs, JOBS, Railway jobs, Rrb group d

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు