రైల్వే అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తోన్న ఆర్ఆర్సీ (Railway Recruimement cell) గ్రూప్ డి పరీక్షకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేంది. కరోనా కారణంగా రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న పరీక్ష ఆర్ఆర్‌బీ గ్రూప్-డీ. ఈ పరీక్షకు సంబంధించి నవంబర్ 26, 2021న తాజాగా ఓ ప్రకటన ఇచ్చింది. ఈ పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ పూర్తయి రెండేళ్లు దాటింది. అంతే కాకుండా పరీక్షకు సంబంధించి అప్లికేషన్ స్టేటస్ చూసే ప్రక్రియ కూడా రెండేళ్ల క్రితమే పూర్తయింది. ఆ సమయంలో కొందరు ఫోటో సరిగా అప్‌లోడ్ చేయకపోవడం కారణంగా లేదా సంతకం సరిగా లేనందున వారి అప్లికేషన్‌లను రిజెక్ట్ (Rejec)t చేశారు. ఈ నేపథ్యంలో వారి మరో అవకాశం ఇచ్చేందుకు ఆర్ఆర్‌బీ(RRB) నిర్ణయించుకొంది.
తాజా ప్రకటనతో ఎవరి అప్లికేషన్ (Application).. తిరస్కరించబడిందో వారు మరో సారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అందించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.
( నోటిఫికేషన్ లింక్ - https://rrbsecunderabad.nic.in/pdf/notice%20for%20modification%20link.pdf)
ఏముంది నోటిఫికేషన్‌లో..
- EN No. RRC-01/2019 నోటిఫికేషన్ (Notification) ఆధారంగా పరీక్షకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులలో కొందరికి ఫోటో, సంతకం సమస్య కారణంగా అప్లికేషన్ రిజెక్టు చేశారు.
- వారికి మరో అవకాశాన్ని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఇస్తోంది.
- తర్వలో ఇందుకు సంబంధించిన లింక్ యాక్టీవ్ అవుతుంది.
- ఎవరి అప్లికేషన్ తిరస్కరించబడిందో వారు తిరిగి ఫోటో లేదా సంతకం మళ్లీ అప్‌లోడ్ చేశాయాల్సి ఉంటుంది.
- ఇందు కోసం అభ్యర్థులు నిబంధనలకు లోబడి పాస్‌పోర్ట్ ఫోటో, సంతకం స్కాన్ ఫోటో కలిగి ఉండాలి.
- తదుపరి సమాచారం కోసం అధికారికవెబ్‌సైట్‌ను మళ్లీ చూడాలని తెలిపారు.
Jobs in Andhra Pradesh: విశాఖపట్నం జిల్లా ఆస్పత్రిలో 126 ఉద్యోగాలు.. జీతం రూ.28,000
చదవాల్సిన సెలబస్..
ఆర్ఆర్‌బీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారు చదవాల్సిన సెలబస్, మ్యాథమెటిక్స్‌లో నెంబర్ సిస్టమ్, BODMAS, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోరేషన్, పర్సెంటేజెస్, మెన్స్యూరేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్‌జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యూలేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టెర్న్ టాపిక్స్‌పైన ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో అనాలజీస్, ఆల్ఫబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, సిల్లాగిసమ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రాం, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ సఫీషియెన్సీ, కన్‌క్లూజన్స్, డిసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్, ఆర్గుమెంట్స్ అండ్ అజంప్షన్స్ టాపిక్స్ ఉంటాయి.
జనరల్ సైన్స్‌లో సీబీఎస్ఈ 10వ తరగతి స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ సిలబస్ కవర్ అవుతుంది. జనరల్ అవేర్‌నెస్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనమిక్స్, పాలిటిక్స్‌లో కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, Job notification, JOBS, Railway jobs