హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSLPRB Update: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. తగ్గిన కట్ ఆఫ్ మార్కులు.. అధికారికంగా ప్రకటించిన బోర్డు..

TSLPRB Update: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. తగ్గిన కట్ ఆఫ్ మార్కులు.. అధికారికంగా ప్రకటించిన బోర్డు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల పోలీస్ నియామక పరీక్షల్లో అన్ని కేటగిరీ అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్షలో 60 మార్కులు కేటాయించడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసీఆర్ అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రటించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఇటీవల పోలీస్ నియామక పరీక్షల్లో అన్ని కేటగిరీ(All Category) అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్షలో(Prelims Exam) 60 మార్కులు కేటాయించడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసీఆర్(KCR) అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రటించారు. దీనిలో భాగంగానే నేడు తెలంగాణ పోలీస్ నియామక మండలి దీనిపై నిర్ణయం తీసుకుంది. కట్ ఆఫ్ మార్కులను సవరిస్తూ జీవో జారీ చేసింది.

ఓసీ అభ్యర్థులకు 30 శాతం, బీసీ అభ్యర్థులకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 20 శాతం మార్కులను కేటాయిస్తున్నట్లు వెబ్ సైట్ లో వెబ్ నోటీస్ జారీ చేశారు. దీంతో 200 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో ఓసీ అభ్యర్థులు  60 మార్కులు, బీసీ అభ్యర్థులు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 40 మార్కులు పొందితే పీఈటీ పరీక్షలకు అర్హత సాధించినట్లుగా తెలిపారు. దీనిపై మొత్తం రెండు సప్లిమెంటరీ నోటిఫికేషన్లు విడుదల చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

TSPSC Halltickets: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారు.. వివరాలిలా..

గత నెల రోజుల నుంచి కూడా తెలంగాణ పోలీస్ నియామక మండలి నుంచి ఎంటువంటి అప్ డేట్ రాలేదు. కట్ మార్కుల విషయమై ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఆందోళన చేయడంతో కేసీఆర్ అందిరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. ఆ రోజు నుంచి కూడా ఎలాంటి కదలిక రాలేదు. తాజాగా ఈ సప్లిమెంటరీ నోటిఫికేషన్ రావడంతో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఎస్సై, కానిస్టేబుల్ ప్రలిమ్స్ పరీక్షలకు సంబంధించి ప్రలిమినరీ కీలో చాలా తప్పులు దొర్లాయి. వాటికి సంబంధించి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. అయితే ఫైనల్ కీ ఇంత వరకు వెబ్ సైట్ లో పెట్టలేదు.

RRB Group D Exam Results: గ్రూప్ D అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష ఫలితాలపై అప్ డేట్..

తమకు మార్కులు కలిసే అవకాశం ఉందని.. వాటిని పరిగణలోకి తీసుకొని ఫలితాలను కూడా త్వరగా ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇప్పటికే నియామక ప్రక్రియ చాలా ఆలస్యం అయింది.

అక్టోబర్ లో ఈవెంట్స్ నిర్వహిస్తామని ప్రకటించిన నియామక బోర్డు కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి జాప్యంతో ఆలస్యం అవుతూ వచ్చింది. దీనిపై క్లారిటీ వచ్చిన నేపథ్యంలో.. వెంటనే ఫలితాలను ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీంతో పాటు మరో న్యూస్ ను వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు సంబంధించిన వివరాలను 4 అక్టోబర్ 2022 వ తారీఖు ఉదయం 8 నుంచి.. 8 అక్టోబర్ 2022 అర్ధరాత్రి 12 గంటల వరకు ఎక్స్-సర్వీస్‌మెన్ క్యాండిటేడ్స్ వివరాలను వెబ్ సైట్లో సమర్పించాలని సూచించారు. లేదంటే ఎక్స్-సర్వీస్‌మెన్ కింద పరిగణించబడరని పేర్కొన్నారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Tslprb

ఉత్తమ కథలు