Home /News /jobs /

GOOD NEWS FOR NEET STUDENTS RESULT SOON WHAT WILL BE THE CUTOFF UMG GH

NEET 2022: నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. త్వరలో రిజల్ట్.. కటాఫ్ ఎంత ఉంటుందంటే ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-యూజీ (NEET UG)-2022 ఆన్సర్ కీ, క్యాండెట్ రెస్పాన్స్ షీట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో విడుదల చేయనుంది. ఇవి ఆగస్టు(August) 14 నాటికి జారీ అవుతాయని అందరూ భావిస్తున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-యూజీ (NEET UG)-2022 ఆన్సర్ కీ, క్యాండెట్ రెస్పాన్స్ షీట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో విడుదల చేయనుంది. ఇవి ఆగస్టు 14 నాటికి జారీ అవుతాయని అందరూ భావిస్తున్నారు. ఆన్సర్ కీ, క్యాండేట్ రెస్పాన్స్ షీట్‌ విడుదలైన తరువాత సంస్థ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో అందుబాటులో ఉంటాయి. గత సంవత్సరం ట్రెండ్స్ పరిశీలిస్తే.. ఆగస్టు చివరి నాటికి నీట్-2022 రిజల్ట్స్‌ను ఆశించవచ్చు. సాధారణంగా ఎన్‌టీఏ మెడికల్(Medical) ప్రవేశ పరీక్ష ఫలితాలను, పరీక్ష నిర్వహించిన నెలన్నరలోపు విడుదల చేస్తుంది. కాగా, నీట్ 2022 జూలై 17న జరిగింది. దీంతో ఫలితాలు ఆగస్టు 31లోపు విడుదల కావడానికి అవకాశం ఉంది.

గతేడాది సెప్టెంబరు 12న నీట్‌ నిర్వహించగా, నవంబర్‌ 1న ఫలితాలు వెలువడ్డాయి. అంటే నెల రోజుల వ్యవధిలోనే ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక 2020 విషయానికి వస్తే.. నీట్ సెప్టెంబర్ 13న నిర్వహించారు. ఫలితాలు అక్టోబర్ 16న వెలువడ్డాయి. నీట్- 2019 ఏప్రిల్ 15న నిర్వహించగా.. జూన్ 5న ఫలితాలు విడుదలయ్యాయి. 2018లో, మే 6న నీట్ పరీక్ష నిర్వహించి, ఫలితాలను జూన్ 4న ప్రకటించారు.

సంవత్సరం పరీక్ష తేదీ ఫలితాల తేదీ
2021 సెప్టెంబర్ 12 నవంబర్ 1
2020 సెప్టెంబర్ 13 అక్టోబర్ 16
2019 ఏప్రిల్ 15 జూన్ 5
2018 మే 6 జూన్ 4

నీట్-2022లో ఉత్తీర్ణత సాధించడానికి, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 40 పర్సంటైల్, పీహెచ్ (PH) అభ్యర్థులకు 45 పర్సంటైల్, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 50 పర్సంటైల్ కటాఫ్‌గా నిర్ణయించారు. ఏటా నీట్ కోసం రెండు వేర్వేరు కటాఫ్‌లను విడుదల చేస్తారు. మొదటిది ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన కనీస మార్కుల సంఖ్యను సూచించే క్వాలిఫైయింగ్ కటాఫ్. దీని తర్వాత అడ్మిషన్ కటాఫ్ ఉంటుంది. దీని ఆధారంగా ప్రవేశాలకు ర్యాంకులు కేటాయిస్తారు.

ఇదీ చదవండి: Mahindra EVs: ఇక అన్ని సెగ్మెంట్లలోకి ఈవీ కార్స్ లాంచ్.. మహీంద్రా ఫ్యూచర్ ప్లాన్ చూస్తే మతిపోతుందీ..!


 గతేడాది జనరల్ కేటగిరీ అభ్యర్థులకు నీట్ అర్హత మార్కులు 138 నుంచి 720 మధ్య ఉండగా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 108 నుంచి 137 మధ్య ఉండేది. అయితే, 2020లో ఇది 147, 2019లో 134 నుంచి తగ్గుకుంటూ వచ్చింది.



ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ పొందాలంటే నీట్-2022లో దాదాపు 600 మార్కులు సాధించాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. మరోపక్క ఈ ఏడాది నీట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య భారీగా ఉంది. దీంతో దేశంలోని అగ్రశ్రేణి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు సాధించడానికి పోటీ ఎక్కువగా ఉంటుంది. పేపర్ గత సంవత్సరం కంటే చాలా కఠినంగా ఉన్నప్పటికీ, కటాఫ్ ఇంకా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కలిపి మొత్తం 91,927 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, JOBS, NEET, Neet exam

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు