Medicine Seats: ఎంబీబీఎస్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

2014-15 లో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 23,000 పీజీ మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవి. క్వాలిఫైడ్ డాక్టర్ల కొరత ఉండటంతో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్‌ని రూపొందించింది నీతి ఆయోగ్.

news18-telugu
Updated: March 17, 2020, 2:49 PM IST
Medicine Seats: ఎంబీబీఎస్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎంబీబీఎస్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లను 4,807 పెంచేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆమోదముద్ర తెలిపినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో 36,192 ఎండీ, ఎంఎస్ ప్రోగ్సామ్స్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్, నీతీ ఆయోగ్ మెంబర్ వీకే పాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. వీటికి 8,000 డీఎన్‌బీ/ఎఫ్ఎన్‌బీ సీట్లు కలిపితే మొత్తం 44,000 పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు 54,000 అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ పాస్ ఔట్స్‌కి ఉంటాయి.

2024 నాటికి పీజీ, యూజీ మెడికల్ సీట్లను రెట్టింపు చేస్తామని 2014 లోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగా 2020-21 సెషన్‌లో 4,807 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ పెంచడానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోద ముద్ర తెలిపింది. దీంతో కొత్త అకడమిక్ సెషన్ కౌన్సిలింగ్‌లో 36,192 పీజీ మెడికల్ సీట్లు (ఎండీ/ఎంఎస్, బ్రాడ్ స్పెషాలిటీ) అందుబాటులో ఉంటాయి.

వీకే పాల్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్, నీతీ ఆయోగ్ మెంబర్


జనరల్ సర్జరీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని ఎంఎస్, జనరల్ మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని ఎండీ అంటారు. 2014-15 లో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 23,000 పీజీ మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవి. క్వాలిఫైడ్ డాక్టర్ల కొరత ఉండటంతో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్‌ని రూపొందించింది నీతి ఆయోగ్.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 జాబ్స్... మార్చి 23 లాస్ట్ డేట్ 

Jobs: హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్‌లో 169 ట్రైనీ జాబ్స్... ఖాళీల వివరాలివే

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
First published: March 17, 2020, 2:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading