ఐటీ, సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకునే ఫ్రెషర్లకు విప్రో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 12,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 33 శాతం అధికంగా నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. సంస్థలు డిజిటల్‌కు విధానాలకు మారుతున్నందున కొత్త ఉద్యోగాలకు అవకాశం ఏర్పడుతోందని ప్రముఖ సంస్థలు చెబుతున్నాయి. దీంతో కంపెనీలు ఫ్రెషర్ల నియామకంపై దృష్టి సారిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసే రెండవ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 6,000 మంది ఫ్రెషర్లను విప్రో రిక్రూట్ చేసుకోనుంది. ఈ సంవత్సరం క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం కొత్తగా 30,000 ఆఫర్ లెటర్స్‌ను జారీ చేయనుంది. ఎంపికైన వారు 2023 ఆర్థిక సంవత్సరంలో విప్రోలో చేరనున్నారు.
IT Jobs: ఆ ఐటీ కంపెనీలో ఫ్రెషర్స్‌కి 35,000 ఉద్యోగాలు
AP Jobs 2021: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో 319 ఉద్యోగాలు... 3 రోజులే గడువు
ప్రస్తుత పరిస్థితుల్లో అధిక అట్రిషన్ రేటు (ఉద్యోగ వలసల రేటు) అన్ని సంస్థలకు సమస్యగా మారిందని చెబుతున్నారు విప్రో సీఈఓ థియరీ డెలాపోర్ట్. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా ఫ్రెషర్లను నియమించుకుంటామని డెలాపోర్ట్ చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో 33 శాతం ఎక్కువ మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని వివరించారు.
SBI Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి ఎస్బీఐలో 6100 జాబ్స్... అప్లై చేయండి ఇలా
IBPS Clerk Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 5,830 పైగా క్లర్క్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
ఇటీవల విప్రో కంపెనీ ఎనిమిది పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్‌ల విలువ 715 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. అయితే కోవిడ్ తరువాత నిపుణులకు డిమాండ్ ఏర్పడించి. కొన్ని సంస్థలు అధిక మొత్తంలో ఇంక్రిమెంట్ ఇస్తూ నిపుణులను ఆకర్షిస్తున్నాయి. దీంతో పెద్ద కాంట్రాక్ట్‌లు చేతిలో ఉన్న సమయంలో, అధిక అట్రిషన్ రేటుతో విప్రో ఆందోళన చెందుతోంది. గత త్రైమాసికంలో 12 శాతం వరకు ఉన్న అట్రిషన్ రేటు 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 15.5 శాతానికి పెరిగింది. దీంతో కొత్తగా ఉద్యోగాల్లో చేరాలనుకునే వారిని క్యాంపర్ రిక్రూట్మెంట్ల ద్వారా నియమించుకోవాలని విప్రో భావిస్తోంది.
సప్లై చైన్ సిస్టమ్‌పై ఎలాంటి ఒత్తిడి పడకుండా కొత్త వాళ్లను ఉద్యోగంలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు సంస్థ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్. అట్రిషన్ రేటుపై దృష్టి పెట్టామని, ఇలాంటి విషయాలు ఆదాయ వృద్ధిని ప్రభావితం చేయవని గోవిల్ వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Government jobs, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs, Wipro