Jobs: గుడ్ న్యూస్... స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో 50,000 ఉద్యోగాలు

Jobs in Smartphone industry | స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఏకంగా 50,000 ఉద్యోగాలు రానున్నాయి.

news18-telugu
Updated: August 20, 2020, 2:47 PM IST
Jobs: గుడ్ న్యూస్... స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో 50,000 ఉద్యోగాలు
Jobs: గుడ్ న్యూస్... స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో 50,000 ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి అనేక రంగాల్లో సంక్షోభం సృష్టించిన సంగతి తెలిసిందే. జీతాల్లో కోత దగ్గర్నుంచి ఉద్యోగాల కోత వరకు అనేక వార్తలు చూస్తున్నాం. ఇలాంటి సంక్షోభ సమయంలో నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త ఇది. స్మార్ట్‌ఫోన్ రంగంలో డిసెంబర్ చివరి నాటికి 50,000 కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీని పెద్దపీట వేస్తోంది. సాంసంగ్, డిక్సన్, ఫాక్స్‌కాన్, విస్ట్రన్, లావా లాంటి సంస్థలు ప్రభుత్వానికి చెందిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్‌లో భాగంగా కొత్తగా స్మార్ట్‌ఫోన్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నాయి. ఫలితంగా ఆయా యూనిట్లలో కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇందుకోసం కంపెనీలు కొత్త నియామకాలు చేపట్టనున్నాయి. అన్ని కంపెనీలు ఏర్పాటు చేయబోయే స్మార్ట్‌ఫోన్ తయారీ యూనిట్లలో ఈ డిసెంబర్ నాటికి 50,000 కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశముంది.

IBPS PO: డిగ్రీ పాసైనవారికి 1167 బ్యాంకు ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

National Recruitment Agency: నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీతో నిరుద్యోగులకు లాభమిదే

భారతదేశంలో లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్ స్కీమ్‌ను 2020 ఏప్రిల్ 1న ప్రకటించింది. పెద్ద పెద్ద కంపెనీలు భారతదేశంలో కంపెనీలను ఏర్పాటు చేసి దేశీయంగా ఉత్పత్తిని పెంపొందించేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. స్మార్ట్‌ఫోన్ తయారీలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ లాంటివన్నీ ఉంటాయి. గత ఐదేళ్లలో భారతదేశంలో మొబైల్ ఫోన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో 1,100% వృద్ధి కనిపించిందని, ఎగుమతులు కూడా మొదలయ్యాయని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఇప్పుడు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్ స్కీమ్‌లో భాగంగా కొత్త ఫ్యాక్టరీలు మొదలైతే ప్రత్యక్షంగా 50,000 ఉద్యోగాలు రానున్నాయి.
Published by: Santhosh Kumar S
First published: August 20, 2020, 2:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading