• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • GOOD NEWS FOR JOBSEEKERS LIFE INSURANCE CORPORATION OF INDIA LIC IS TOP IN RECRUITING AGENTS SS

LIC Agent Jobs: ఏజెంట్ల నియామకాల్లో ఎల్ఐసీ దూకుడు... మీరూ అప్లై చేయొచ్చు ఇలా

LIC Agent Jobs: ఏజెంట్ల నియామకాల్లో ఎల్ఐసీ దూకుడు... మీరూ అప్లై చేయొచ్చు ఇలా

LIC Agent Jobs: ఏజెంట్ల నియామకాల్లో ఎల్ఐసీ దూకుడు... మీరూ అప్లై చేయొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

LIC Agent Jobs | ఏజెంట్లను నియమించుకునే విషయంలో లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC దూకుడు చూపిస్తోంది.

  • Share this:
    కరోనా వైరస్ మహమ్మారి ప్రజలందరిలో ఆర్థిక క్రమశిక్షణను తీసుకొచ్చిన మాట అందరూ అంగీకరిస్తారు. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజల్లో ఇన్స్యూరెన్స్ ఉండాలన్న ఆలోచన పెరిగింది. హెల్త్ ఇన్స్యూరెన్స్‌తో పాటు లైఫ్ ఇన్స్యూరెన్స్ తీసుకునేవారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో ఇన్స్యూరెన్స్ కంపెనీలకు కరోనా వైరస్ మహమ్మారి బాగా కలిసొచ్చినట్టైంది. భారతదేశంలో ఇన్స్యూరెన్స్ కంపెనీ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC. భారత ప్రభుత్వానికి చెందిన బీమా కంపెనీ ఇది. దేశంలోని అన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలతో పోలిస్తే ఎల్ఐసీదే మొదటి స్థానం. ఎవరూ అందుకోలేనంత స్థానం. కరోనా కాలంలో ఎల్ఐసీకి బిజినెస్ కూడా పెరిగింది. దీంతో ఏజెంట్ల నియామకాల్లో ఎల్ఐసీ దూకుడు చూపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత దూకుడుతో ఎల్ఐసీ ఏజెంట్లను నియమిస్తోంది.

    Railway Jobs 2021: రైల్వేలో 1004 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

    SBI Recruitment 2021: ఎస్‌బీఐలో 489 మేనేజర్ ఉద్యోగాలు... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే



    లైఫ్ ఇన్స్యూరెన్స్ కౌన్సిల్ లెక్కలు చూస్తే 2020 ఏప్రిల్ 1 నాటికి ఎల్ఐసీ ఏజెంట్లు 12,08,826 ఉన్నారు. 2020 నవంబర్ నాటికి ఎల్ఐసీ ఏజెంట్ల సంఖ్య 13,08,099. కరోనా కాలంలోనే 98,809 ఏజెంట్లు ఎల్ఐసీ నుంచి తప్పుకున్నారు. అయితే ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఎల్ఐసీ ఏకంగా 1,98,082 మంది ఏజెంట్లను నియమించుకుంది. అంటే సుమారు రెండు లక్షల మంది కొత్త ఏజెంట్లను నియమించుకుంది ఎల్ఐసీ. టెన్త్ పాసైన వారిని ఏజెంట్లుగా నియమించుకుంటోంది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC. మీరూ ఎల్ఐసీ ఏజెంట్ కావాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో, ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    LIC Agent Recruitment: ఎల్ఐసీ ఏజెంట్‌ జాబ్‌కు అప్లై చేయండిలా... టెన్త్ పాసైతే చాలు

    IRCTC Agent Scheme: పెట్టుబడి రూ.3999... నెలకు ఆదాయం రూ.80,000... బిజినెస్ ఐడియా ఇదే

    ఎల్ఐసీ మాత్రమే కాదు... ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు కూడా భారీ స్థాయిలో ఏజెంట్లను నియమించుకోవడం విశేషం. అన్ని ప్రైవేట్ కంపెనీల్లో 2020 ఏప్రిల్ 1 నాటికి 10,69,639 ఏజెంట్లు ఉన్నారు. ఏడు నెలల్లో 127826 ఏజెంట్లు మానేశారు. 2020 నవంబర్ నాటికి ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ ఏజెంట్ల సంఖ్య 10,76,401. ఆరు నెలల్లో 1,34,588 ఏజెంట్లు చేరారు. ఈ లెక్కలు చాలు ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవడానికి. ఈ రంగంలో ఇంకా అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి నిరుద్యోగులు ఇన్స్యూరెన్స్ రంగంపైనా దృష్టిపెట్టడం అవసరం. ఇన్స్యూరెన్స్ ఏజెంట్లుగానే కాదు... ఇన్స్యూరెన్స్ కంపెనీల్లో అనేక విభాగాల్లో ఖాళీలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగా విద్యార్హతలు, స్కిల్స్ ఉంటే ఉద్యోగాలు పొందడం సులువు.
    Published by:Santhosh Kumar S
    First published: