నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త. రాబోయే ఫెస్టివల్ సేల్స్ దృష్టిలో పెట్టుకొని భారీగా ఉద్యోగాలను ప్రకటించింది లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఇకామ్ ఎక్స్‌ప్రెస్. దసరా, దీపావళి సమయంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, ఏజియో, పేటీఎం మాల్ లాంటి సంస్థలు ఫెస్టివల్ సేల్స్ నిర్వహిస్తాయి. అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ చివరి వరకు ఫెస్టివల్ సేల్ సందడి కనిపిస్తుంది. ప్రతీ ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆన్లైన్ షాపింగ్ చేసేవారే ఎక్కువ. ఈ రెండు నెలలు పార్శిల్ డెలవరీస్ కోసం లాజిస్టిక్స్ సంస్థల్ని ఆశ్రయిస్తుంటాయి కంపెనీలు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి సంస్తలకు సొంత డెలివరీ వ్యవస్థలు ఉన్నా ఫెస్టివల్ సీజన్లో ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డెలివరీల కోసం ఇతర సంస్థలపై ఆధారపడక తప్పదు. అందుకే ఈ ఫెస్టివల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఇకామ్ ఎక్స్‌ప్రెస్ 30,000 ఉద్యోగాలను ప్రకటించింది. అయితే ఇవి తాత్కాలిక ఉద్యోగాలు మాత్రమే. కేవలం ఫెస్టివల్ సీజన్ వరకే పరిమితం.
UPSC Jobs 2020: మొత్తం 307 ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్
Jobs: ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 107 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
కరోనా వైరస్ సంక్షోభం కన్నా ముందు ఇకామ్ ఎక్స్‌ప్రెస్‌లో 23,000 మంది పనిచేస్తుండగా లాక్డౌన్ తర్వాత నిత్యావసర సరుకుల దగ్గర్నుంచి మెడిసిన్ వరకు ఆన్లైన్ ఆర్డర్స్ పెరిగాయి. దీంతో మరో 7,500 మందిని నియమించుకుంది. అయితే మరో రెండు నెలలు ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఆన్లైన్ ఆర్డర్స్ భారీగా పెరుగుతాయి. అందుకే మరో 30,000 తాత్కాలిక ఉద్యోగాలను నియమించనుంది ఇకామ్ ఎక్స్‌ప్రెస్. అక్టోబర్ 10 వరకు నియామక ప్రక్రియ కొనసాగనుంది. ఫ్రెషర్స్‌కే ఎక్కువ అవకాశం ఇవ్వనుంది. ప్యాకేజింగ్ నుంచి కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ వరకు... ఏ రోల్లో వారిని ఎంపిక చేస్తే ఆ అంశాల్లో శిక్షణ ఇచ్చి సేవల్ని వినియోగించుకుంటుంది.
Railway Jobs: రైల్వేలో 4499 జాబ్స్... దరఖాస్తుకు నాలుగు రోజులే ఛాన్స్
IBPS Clerk 2020: బ్యాంకు ఉద్యోగం మీ కలా? 1557 క్లర్క్ పోస్టులకు అప్లై చేయండి ఇలా
ఇప్పుడే కాదు గత ఏడాది ఫెస్టివల్ సీజన్లో 20,000 మందిని నియమించుకుంది ఇకామ్ ఎక్స్‌ప్రెస్. ఈసారి మరో 10,000 మందిని ఎక్కువగా నియమిస్తోంది. ఇవన్నీ తాత్కాలిక పోస్టులే. అయితే ఆర్డర్లు పెరిగితే వీరిలో 10,000 మందిని శాశ్వతంగా నియమించుకుంటుంది.
Published by:Santhosh Kumar S
First published:September 14, 2020, 13:24 IST