Amazon India: 20,000 ఉద్యోగాలను ప్రకటించిన అమెజాన్... హైదరాబాద్‌లోనూ ఖాళీలు

Amazon India Jobs | నిరుద్యోగులకు శుభవార్త. అమెజాన్ ఇండియా భారతదేశంలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. హైదరాబాద్‌లోనూ ఖాళీలున్నాయి.

news18-telugu
Updated: June 29, 2020, 11:00 AM IST
Amazon India: 20,000 ఉద్యోగాలను ప్రకటించిన అమెజాన్... హైదరాబాద్‌లోనూ ఖాళీలు
Amazon India: 20,000 ఉద్యోగాలను ప్రకటించిన అమెజాన్... హైదరాబాద్‌లోనూ ఖాళీలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. అమెజాన్ ఇండియా 20,000 ఉద్యోగాలను ప్రకటించింది. కస్టమర్ సర్వీస్ ఆర్గనైజేషన్‌లో 20,000 ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్, కోల్‌కతా, పూణె, బెంగళూరు, చెన్నై లాంటి 11 ప్రాంతాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. వర్చువల్ కస్టమర్ సర్వీస్ ప్రోగ్రామ్‌లో ఎక్కువ అవకాశాలున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కోరుకునేవారికి ఇవి మంచి ఉద్యోగాలు. ఇటీవల భారతదేశంలో ఫుల్‌ఫిల్‌మెంట్, డెలివరీ నెట్వర్క్స్‌లో 50,000 తాత్కాలిక ఉద్యోగావకాశాలను కల్పించినట్టు అమెజాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుండటంతో వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగ్‌పైన ఆధారపడుతున్నారు. దీంతో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. నిత్యావసర వస్తువుల దగ్గర్నుంచి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హోమ్ అప్లయెన్సెస్, దుస్తులు, వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కావాల్సిన గ్యాడ్జెట్స్... ఇలా చాలావాటికి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు కస్టమర్లు.

కస్టమర్లను ఆకట్టుకోవడానికి అమెజాన్ ఇండియా ఆన్‌లైన్ సేల్స్ నిర్వహిస్తోంది. ఇటీవలే 7 రోజుల సేల్ ముగిసింది. ఇంకా ఆన్‌లైన్ షాపింగ్ డిమాండ్ పెరుగుతుండటంతో కొత్త ఉద్యోగాలు సృష్టిస్తోంది. "మరో ఆరు నెలల్లో మా కస్టమర్ ట్రాఫిక్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం" అని అమెజాన్ ఇండియా కస్టమర్ సర్వీస్ డైరెక్టర్ అక్షయ్ ప్రభు తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక పోస్టుల్ని భర్తీ చేస్తోంది అమెజాన్ ఇండియా. ఉద్యోగుల పర్ఫామెన్స్‌ని బట్టి ఏడాది చివరి నాటికి పర్మనెంట్ చేయనుంది. భారతదేశంలో 2025 నాటికి 10 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని అమెజాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారతదేశంలో గత ఏడేళ్లలో 700,000 ఉద్యోగాలను అమెజాన్ సృష్టించింది.

 
First published: June 29, 2020, 11:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading