హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

HCL Recruitment drive: నిరుద్యోగులకు శుభవార్త... విజయవాడలో 1000 పోస్టుల భర్తీకి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్

HCL Recruitment drive: నిరుద్యోగులకు శుభవార్త... విజయవాడలో 1000 పోస్టుల భర్తీకి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

HCL Technologies recruitment drive in Vijayawada | ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మెగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

నిరుద్యోగులకు శుభవార్త. ఐటీ కంపెనీల్లో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1000 పోస్టుల భర్తీకి మెగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో గన్నవరంలో గ్లోబల్ ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్... 1000 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇంటర్మీడియట్ నుంచి బీటెక్, ఎంటెక్ లాంటి ఐటీ కోర్సులు పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వర్చువల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్, న్యూ విస్టాస్ డైరెక్టర్ శ్రీమతి శివశంకర్ ప్రకటించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ లాంటి కోర్సులు పాస్ అయినవారితో పాటు జావా, చిప్ డిజైనింగ్, డాట్ నెట్, పైథాన్ లాంటి టెక్నాలజీస్‌లో 2 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉన్నవారు ఎవరైనా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మెగా వర్చువల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొనొచ్చు.

MIDHANI Recruitment 2021: నెల్లూరులోని మిధాని సంస్థలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 4 రోజులే గడువు

RBI Grade B Jobs 2021: ఆర్‌బీఐ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది... ఖాళీల వివరాలు ఇవే

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లోని న్యూ విస్టాస్ ప్రోగ్రామ్‌లో భాగంగా విజయవాడ సమీపంలోని గన్నవరం యూనిట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 1,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరో 1000 పోస్టుల్ని ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించే మెగా వర్చువల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనుంది హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌. ఎంపికైన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో శిక్షణ ఇవ్వనుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.hcltech.com/careers వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. మరో నాలుగు ఏళ్లలో విజయవాడ యూనిట్‌లో ఉద్యోగులు 5,000 సంఖ్యకు చేరుకోనున్నట్టు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ ప్రకటించింది. వీరిలో 90 శాతం విజయవాడ, పరిస ప్రాంతాలకు చెందినవారికే అవకాశం లభించనుంది.

AAI Recruitment 2021: ఎయిర్‌పోర్ట్ అథారిటీలో 368 జాబ్స్... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల... వారికి మాత్రమే

ఇక హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో టెక్‌బీ పేరుతో ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్ ఉంది. ఇంటర్మీడియట్ 65 శాతం మార్కులతో పాస్ అయినవారు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేయొచ్చు. వారికి ఒక ఏడాది శిక్షణ తర్వాత ఎంట్రీలెవెల్ ఉద్యోగం కల్పిస్తారు. దీంతో పాటు ఉన్నత విద్య చదువుకోవాలనుకునే టెక్‌బీ స్కాలర్స్‌కు బిట్స్ పిలానీ లేదా శాస్త్ర యూనివర్సిటీలో విద్యాభ్యాసం కోసం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ సహకారం అందిస్తుంది. ఇప్పటికే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ టెక్‌బీ ప్రోగ్రామ్‌కు 750 మంది విద్యార్థులు ఎన్‌రోల్ చేసుకున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, Telugu news, Telugu updates, Telugu varthalu

ఉత్తమ కథలు