Paytm Jobs: పేటీఎంలో 1,000 పైగా జాబ్స్... వీరికే అవకాశం

Paytm Jobs | నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. కరోనా వైరస్ సంక్షోభ కాలంలో కూడా పేటీఎం 1,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: August 27, 2020, 9:09 AM IST
Paytm Jobs: పేటీఎంలో 1,000 పైగా జాబ్స్... వీరికే అవకాశం
Paytm Jobs: పేటీఎంలో 1,000 పైగా జాబ్స్... వీరికే అవకాశం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇప్పుడు అసలే కరోనా సంక్షోభ కాలం. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం దేశమంతా ఉంది. అనేక రంగాలు కుదేలవుతున్నాయి. ఉద్యోగాల కోత తప్పట్లేదు. జీతాలు కూడా తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాలు రావడం కష్టమే. కానీ ఫిన్ టెక్ కంపెనీ అయిన పేటీఎం 1,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనుంది. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో ఫైనాన్షియల్, వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లాంటి వేర్వేరు సెగ్మెంట్స్‌ని విస్తరిస్తున్న పేటీఎం... పలు విభాగాల్లో 1,000 మందికి కొత్త పోస్టుల్ని భర్తీ చేయనుంది. మరి కొన్ని నెలల్లో ఈ నియామక ప్రక్రియ పూర్తి చేయనుంది. ఇంజనీర్స్, డేటా సైంటిస్ట్స్, ఫైనాన్షియల్ అనలిస్ట్స్ లాంటి టెక్నికల్ పోస్టులతో పాటు నాన్ టెక్నికల్ పోస్టులు ఉంటాయని పేటీఎం ప్రకటించింది.

ఫైనాన్షియల్, వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగాలను వేగంగా విస్తరిస్తున్నాం. అందుకే కంపెనీ నియామకాలను వేగవంతం చేస్తోంది. అదనంగా మరో 1000 మందిని నియమించుకుంటోంది. ఇందులో టెక్నికల్ రోల్స్‌తో పాటు నాన్ టెక్నికల్ రోల్స్ ఉన్నాయి.

పేటీఎం ప్రకటన


HCL Jobs: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో 800 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

Work From Home Jobs: ఉద్యోగం లేదా? ఇంటి నుంచే పనిచేస్తూ డబ్బు సంపాదించండి ఇలా

మొదట్లో పేటీఎం అంటే మొబైల్ రీఛార్జ్, బిల్ పేమెం ప్లాట్‌ఫామ్‌గానే అందరికీ తెలుసు. కానీ పేటీఎం ఆ తర్వాత తన వ్యాపారాన్ని విస్తరించింది. ఆఫ్‌లైన్ పేమెంట్స్, ఆన్‌లైన్ షాపింగ్, ఎలక్ట్రిసిటీ, ఇన్స్యూరెన్స్ బిల్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇటీవల స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ వ్యాపారాల్లో అడుగుపెట్టింది. వ్యాపారాన్ని విస్తరిస్తుండటంతో కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఏర్పడింది. అందులో భాగంగా టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులతో పాటు 50 మందికి పైగా సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటీవ్స్, వైస్ ప్రెసిడెంట్ రోల్స్‌ లాంటి సీనియర్ లీడర్‌షిప్ నియామకాలు కూడా చేపడుతోంది పేటీఎం. ఏప్రిల్‌లో 500 మందిని నియమించుకుంటామని పేటీఎం ప్రకటించింది. అయితే గత నాలుగు నెలల్లో 700 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. లాక్‌డౌన్ సమయంలో కూడా ఇంటర్వ్యూలు, నియామకాలు పూర్తి చేయడం విశేషం. అంతేకాదు... ఇప్పటివరకు ఉద్యోగులను తొలగించలేదని, జీతాలు కట్ చేయలేదని పేటీఎం చెబుతోంది.
Published by: Santhosh Kumar S
First published: August 27, 2020, 9:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading