హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Scholarship: ఇండియన్ స్టూడెంట్స్‌కు రూ.7 కోట్ల 30 లక్షల స్కాలర్‌షిప్ ప్యాకేజ్.. ఆ యూనివర్సిటీ బంపరాఫర్!

Scholarship: ఇండియన్ స్టూడెంట్స్‌కు రూ.7 కోట్ల 30 లక్షల స్కాలర్‌షిప్ ప్యాకేజ్.. ఆ యూనివర్సిటీ బంపరాఫర్!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Scholarship: స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 10 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్కాలర్‌షిప్‌ల కోసం భారత అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారతీయ విద్యార్థుల (Indian Students)కు గుడ్ న్యూస్ చెప్పింది న్యూజిలాండ్‌‌‌లోని వైపాపా టౌమాటా రౌ యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ (Waipapa Taumata Rau University of Auckland). ఈ సంస్థ ఇండియన్ స్టూడెంట్స్‌కు ఏకంగా 1.5 మిలియన్ న్యూజిలాండ్ డాలర్ల (రూ.7,30,69,431) విలువైన స్కాలర్‌షిప్ ప్యాకేజీని ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ ఇండియా హై అచీవర్స్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 10 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్కాలర్‌షిప్‌ల కోసం భారత అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.అధికారిక ప్రెస్ నోట్ ప్రకారం, హై-ఎఛీవింగ్ ఇండియన్ స్టూడెంట్స్‌కు 200కి పైగా స్కాలర్‌షిప్‌లను కలిగి ఉన్న స్కాలర్‌షిప్ ప్యాకేజీ 2023లో అందుబాటులో ఉంది. ఈ స్కాలర్‌షిప్స్ సంవత్సరానికి రెండుసార్లు అందజేస్తారు. ఇలా ఇచ్చేవి 115 ఉన్నాయి. ప్రతి సైకిల్‌లో $20,000 విలువ చేసేవి ఐదు స్కాలర్‌షిప్స్, $10,000 విలువ చేసేవి 10, $5,000 విలువ చేసే 100 స్కాలర్ షిప్‌లను అందజేస్తారు.


ఈ సందర్భంగా ఆక్లాండ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఐన్స్లీ మూర్ మాట్లాడుతూ.. “ఈ స్కాలర్‌షిప్‌లు పరస్పరం ప్రయోజనకరంగా ఉంటాయని మేం విశ్వసిస్తున్నాం. మా స్కాలర్‌షిప్ అవార్డు గ్రహీతలను ఆక్లాండ్‌కు స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నాం. మా అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్‌లకు వైవిధ్యం, గొప్పతనాన్ని జోడిస్తారు. అలాగే పరిశోధనలో, విస్తృత న్యూజిలాండ్ వర్క్‌ఫోర్స్‌లో ప్రధాన పాత్ర పోషిస్తారు.’’ అని పేర్కొన్నారు.
* యూనివర్సిటీ ప్రత్యేకతలు
న్యూజిలాండ్‌లోని అయోటెరోవాలో ఉన్న ఆక్లాండ్ యూనివర్సిటీ 2023 QS వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 87వ స్థానంలో ఉంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) ప్రపంచ ర్యాంకింగ్స్‌ ప్రకారం.. 137వ స్థానంలో ఉంది. 2019లో యూనివర్సిటీ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఈ యూనివర్సిటీ నిలిచింది. 2022లో వరల్డ్ 6వ ర్యాంకు సొంతం చేసుకుంది. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGs) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు ఎలా పని చేస్తున్నాయో.. ‘యూనివర్సిటీ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్‌’ మెజర్ చేస్తుంది.
ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్‌న్యూస్.. భారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి..
ఆక్లాండ్ యూనివర్సిటీని 1883లో స్థాపించారు. 40,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులతో న్యూజిలాండ్‌లోనే అతిపెద్ద యూనివర్సిటీగా ఇది ప్రసిద్ధి పొందింది. ఇందులో 100 దేశాల నుంచి 8,000 మంది అంతర్జాతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. యూనివర్సిటీకి చెందిన ఎనిమిది మంది ఫ్యాకల్టీలు, రెండు లార్జ్-స్కేల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ హై- క్వాలిటీ రీసర్చ్‌కు ప్రాతినిధ్యం వహిస్తాయి. దీంతో అంతర్జాతీయ పరిశోధనా యూనివర్సిటీల్లో ఆక్లాండ్ యూనివర్సిటీ ప్రసిద్ధి పొందింది.
ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన అన్షికా పటేల్, అమెరికాలోని వాషింగ్టన్ అండ్ లీ యూనివర్సిటీలో 100 శాతం స్కాలర్‌షిప్‌తో సీటు సంపాదించింది, గణితంలో మైనర్‌తో పాటు ఎకనామిక్స్ మేజర్‌లను అభ్యసించనుంది. జౌన్‌పూర్ జిల్లా, పక్రి గోడమ్ గ్రామానికి చెందిన ఈ18 ఏళ్ల అమ్మాయి ఖతార్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటికి కూడా ఎంపిక అయింది. అలాగే మరో ఐదు యూనివర్సిటీలు వెయిట్‌లిస్ట్‌లో ఉన్నాయి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, Newzealand, Scholarship

ఉత్తమ కథలు