హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Wipro Jobs 2021: ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్... రూ.30,000 జీతంతో విప్రోలో ఉద్యోగాలు.. వివరాలివే

Wipro Jobs 2021: ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్... రూ.30,000 జీతంతో విప్రోలో ఉద్యోగాలు.. వివరాలివే

Wipro Jobs 2021: ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్... రూ.30,000 జీతంతో విప్రోలో ఉద్యోగాలు
(ప్రతీకాత్మక చిత్రం)

Wipro Jobs 2021: ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్... రూ.30,000 జీతంతో విప్రోలో ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)

Wipro Elite National Talent Hunt FY 2021 | బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. విప్రోలో ఫ్రెషర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

  భారతదేశానికి చెందిన మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ విప్రో లిమిటెడ్ ఫ్రెషర్స్‌ని నియమించుకోబోతోంది. ఇందుకోసం ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ 2021 ప్రారంభిస్తోంది. దేశవ్యాప్తంగా మంచి టాలెంట్ ఉన్న ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్‌కు ఉద్యోగాలు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇవ్వబోతోంది. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి స్ట్రీమ్స్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిని విప్రో కంపెనీలోకి ఆహ్వానిస్తోంది. 2021లో ఇంజనీరింగ్ పూర్తి చేసేవారికి మాత్రమే అవకాశం ఇవ్వనుంది విప్రో. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే manager.campus@wipro.com మెయిల్ ఐడీకి Elite NTH 2021 సబ్జెక్ట్‌తో మెయిల్ పంపాలి. మూడు వర్కింగ్ డేస్‌లో సమాధానాలు వస్తాయి.

  Wipro Elite National Talent Hunt FY 2021: విప్రో ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ 2021 వివరాలివే


  భర్తీ చేసే పోస్టులు- ప్రాజెక్ట్ ఇంజనీర్

  విద్యార్హతలు- 10వ తరగతిలో 60 శాతం కన్నా ఎక్కువ, 12వ తరగతిలో 60 శాతం కన్నా ఎక్కువ మార్కులతో పాస్ కావాలి. గ్రాడ్యుయేషన్ 65 శాతం మార్కులతో పాస్ కావాలి. 2021 సంవత్సరంలో బీఈ, బీటెక్, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పాసయ్యేవారికే అవకాశం.

  బ్రాంచ్‌లు- కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సర్క్యుటల్

  వేతనం- వార్షికంగా రూ.3,50,000

  AAI Recruitment 2020: ఎయిర్‌పోర్ట్ అథారిటీలో 368 జాబ్స్... రూ.1,00,000 పైగా జీతం

  Railway Jobs 2021: రైల్వేలో 1004 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  Wipro Elite National Talent Hunt FY 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  ఇతర ప్రమాణాలు- 10వ తరగతి, గ్రాడ్యుయేషన్ మధ్య మూడేళ్లు గ్యాప్ ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచే ఫుల్ టైమ్ డిగ్రీ కోర్సు చేయాలి. 10వ తరగతి, 12వ తరగతి పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ కోర్స్ చేసినవారికి అవకాశం లేదు. సెలక్షన్ నాటికి అన్ని బ్లాక్ లాగ్స్ క్లియర్ చేయాలి. గత ఆరు నెలల్లో విప్రో నిర్వహించిన సెలక్షన్ ప్రాసెస్‌లో పాల్గొన్న అభ్యర్థులకు అవకాశం లేదు.

  DRDO Scholarship 2020: డీఆర్‌డీఓ నుంచి రూ.1,86,000 స్కాలర్‌షిప్... లాస్ట్ డేట్ ఎప్పుడంటే

  DRDO Recruitment 2020: రూ.54,000 వేతనంతో హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో జాబ్స్... ఖాళీల వివరాలివే

  Wipro Elite National Talent Hunt FY 2021: ఎంపిక విధానం


  ఎంపిక విధానం- ఆన్‌లైన్ అసెస్‌మెంట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

  ఆన్‌లైన్ అసెస్‌మెంట్- ఆన్‌లైన్ అసెస్‌మెంట్ 128 నిమిషాలు ఉంటుంది. మూడు సెక్షన్స్ ఉంటాయి. 48 నిమిషాలు యాప్టిట్యూడ్ టెస్ట్, 20 నిమిషాలు రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్, 60 నిమిషాలు ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ ఉంటుంది.

  పరీక్షా విధానం- యాప్టిట్యూడ్ టెస్ట్‌లో లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటీవ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ వర్బల్ ఎబిలిటీ టాపిక్స్ ఉంటాయి. రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్‌లో ఎస్సే రైటింగ్ ఉంటుంది. ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్‌లో కోడింగ్‌కు సంబంధించిన రెండు ప్రోగ్రామ్స్ ఉంటాయి. అభ్యర్థులు జావా, సీ, సీ++, పైథాన్‌లో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంచుకోవచ్చు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, Wipro