హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Gandinagar: ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్‌కు ఐఐటీ గాంధీనగర్ బంపరాఫర్.. త్వరపడండి..

IIT Gandinagar: ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్‌కు ఐఐటీ గాంధీనగర్ బంపరాఫర్.. త్వరపడండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IIT Gandinagar: విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షల కంటే తక్కువగా ఉన్నవారు మాత్రమే ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన స్టూడెంట్స్‌కు (EWS Students) గుడ్‌న్యూస్ చెప్పింది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ (IIT GN). దేశవ్యాప్తంగా వందమంది ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్‌కు వివిధ అంశాలపై స్పెషల్ ట్రైనింగ్ (Special Training) ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇందుకు నాన్ ప్రాఫిటబుల్ సంస్థ దక్షణ, రుయింతన్ మెహతా అనే ఎంటర్‌ప్రెన్యూర్‌తో చేతులు కల్పింది. ఈ మేరకు ‘ఐఐటీ జీఎన్-దక్షణ లీడర్‌షిప్ ప్రోగ్రామ్’ను ప్రారంభించనుంది.ఈ ప్రోగ్రామ్ 2022 సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభ ఉన్న 100 మంది గ్రామీణ విద్యార్థుల్లో లీడర్‌షిప్, క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ వంటి స్కిల్స్‌ పెంపొందించడానికి ట్రైనింగ్ ఇవ్వనుంది.


అయితే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షల కంటే తక్కువగా ఉన్నవారు మాత్రమే ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాలు, ఇతర ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను.. 10, 12 తరగతుల ఫలితాలను బట్టి, అలాగే దక్షిణ ప్రొప్రైటరీ టెస్టింగ్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.


మొదటి ఐఐటీ జీఎన్ దక్షణ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా 100 మంది దక్షణ స్కాలర్స్‌(విద్యార్థులు) ట్రైనింగ్ పొందనున్నారు. దక్షణ సంస్థకు చెందిన పూణే, బెంగళూర్, హైదరాబాద్ బ్రాంచ్‌ల నుంచి స్కాలర్స్‌ను ఎంపిక చేయనున్నారు. ఐఐటీ గాంధీనగర్‌లో విద్యార్థులకు ట్రైనింగ్ ఉంటుంది.భారత్, విదేశాలకు చెందిన బెస్ట్ మెంటర్స్ శిక్షణ ఇవ్వనున్నారు. యూఎస్ బేస్డ్ ఇండిపెండెంట్ మీడియా సంస్థ ఫెయిర్ అబ్జర్వర్(Fair Observer) సీఈవో అతుల్ సింగ్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పీటర్ ఇసాక్సన్ కమ్యూనికేషన్‌కు సంబంధించిన బేసిక్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.


30 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న విద్యావేత్త, పర్సనల్ గ్రోత్ ఫెసిలిటేటర్ ఉమా ఓజా.. విద్యార్థుల్లో లీడర్‌షిప్ క్వాలిటీస్ పెంపొందించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఐఐటీ గాంధీనగర్‌లోని జాసుభాయ్ మెమోరియల్ చైర్ ప్రొఫెసర్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ హెడ్ ప్రొఫెసర్ జైసన్ ఎ. మాంజలి విద్యార్థులకు క్రిటికల్ థింకింగ్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులు అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం, అదాలజ్ స్టెప్‌వెల్ వంటి వారసత్వ ప్రదేశాలను కూడా సందర్శించనున్నారు.


ఇది కూడా చదవండి : ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలు ఇవే..


ఈ ప్రోగ్రామ్‌కు నిధులను యూఎస్‌‌లోని సీరియల్ ఎంటర్ ప్రెన్యూయర్ రుయింతన్ మెహతా సమకూర్చనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నేను గత కొన్ని సంవత్సరాలుగా ‘దక్షణ’ విద్యార్థుల పురోగతిని చూశాను. ఈ విద్యార్థులు చాలా తెలివైనవారు. వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఐఐటీ గాంధీ నగర్ దక్షణ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు IITలో తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు సమాన స్థాయిని అందిస్తుంది. అవసరమైన స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా సామర్థ్యం ఉన్న వారిగా తీర్చిదిద్దడంలో ఈ ప్రోగ్రామ్ దోహదపడుతుంది.’’ అని తెలిపారు.


* షార్ట్-టర్మ్ కోర్సులు
విద్యార్థులు, ప్రొఫెషనల్స్ కోసం అనేక ఐఐటీలు షార్ట్-టర్మ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఐఐటీ బాంబే డిజైన్ థింకింగ్‌పై ఐదు నెలల సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తుంది. ఒక సంవత్సరం వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఏదైనా స్ట్రీమ్ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐఐటీ మద్రాస్.. యూజీ, పీజీ విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్‌పై 12 వారాల కోర్సును కూడా ఆఫర్ చేస్తోంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, IIT, JOBS

ఉత్తమ కథలు