GOOD NEWS FOR ENGINEERING STUDENTS HRD MINISTRY OFFERS JOB READINESS PROGRAMME TO PURSUE CAREER IN TOP IT FIRMS SS
Free Course: ఐటీ కంపెనీలో జాబ్ మీ కలా? ఈ కోర్సు చేయండి
Free Course: ఐటీ కంపెనీలో జాబ్ మీ కలా? ఈ కోర్సు చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
Job Readiness | ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్, క్యాప్‌జెమిని, యాక్సెంచర్, ఒరాకిల్, ఐబీఎం, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, విప్రో లాంటి కంపెనీల్లో మీ కెరీర్ ప్రారంభించాలనుకుంటే విద్యార్థులు ఈ ఖాళీ సమయాల్లో మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయొచ్చు.
మీరు బీటెక్ చదువుతున్నారా? లాక్డౌన్ వల్ల పాఠాలు మిస్ అవుతున్నామనుకుంటున్నారా? కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 'జాబ్ రెడీనెస్' పేరుతో ఓ కోర్సు అందిస్తోంది. ఇ-లెర్నింగ్ సంస్థ పర్ఫెక్టీవ్ ఎడ్వెంచర్తో కలిసి ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కోర్సు రూపొందించింది. బీటెక్ విద్యార్థులు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈ కోర్సును ఉచితంగానే పూర్తి చేయొచ్చు. పర్ఫెక్టీవ్ ఎడ్వెంచర్, నేషనల్ ఎడ్యుకేషనల్ అలయెన్స్ ఫర్ టెక్నాలజీ-NEAT సంయుక్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగాలకు సంబంధించి 1,000 ప్రాక్టీస్ పేపర్స్ రూపొందించాయి. ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు టిప్స్ సూచిస్తున్నాయి. విద్యార్థులు లిస్ట్‌లో ఉన్న ఐటీ సంస్థను ఎంపిక చేసుకొని మాక్ టెస్టులు అటెండ్ కావొచ్చు. ఇందులో వర్బల్ ఎబిలిటీ, క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్, కోర్ ప్రోగ్రామింగ్, అడ్వాన్స్డ్ టెక్నికల్ స్కిల్స్ లాంటి అంశాల్లో మాక్ టెస్టులు ఉంటాయి.
An #AI solution 'Job Readiness' have collaborated with #NEAT to prepare students for job interviews in future by offering company-specific placement mocks and 1000+ practice papers.
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) April 2, 2020
ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్, క్యాప్‌జెమిని, యాక్సెంచర్, ఒరాకిల్, ఐబీఎం, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, విప్రో లాంటి కంపెనీల్లో మీ కెరీర్ ప్రారంభించాలనుకుంటే విద్యార్థులు ఈ ఖాళీ సమయాల్లో మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయొచ్చు. 'జాబ్ రెడీనెస్' ప్రోగ్రామ్ అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం రూపొందించిన కోర్స్. ఈ కోర్స్ పూర్తి చేస్తే క్యాంపస్ డ్రైవ్‌లో అసెస్మెంట్, కోడింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌కు కావాల్సిన అవగాహన లభిస్తుంది. ఈ మాడ్యుల్లో 30 పైగా కంపెనీలకు చెందిన 1,000 పైగా ప్రశ్నలుంటాయి. మీరు ఈ కోర్సు చేయాలంటే 3 జీ నెట్వర్క్, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే చాలు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఈ కోర్సు పూర్తి చేయొచ్చు. మార్చి 20న ప్రారంభమైన కోర్స్ డిసెంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుంది. మరి మీరు కూడా ఈ కోర్సు చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.