• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • GOOD NEWS FOR EMPLOYEES CM JAGAN WILL RELEASED JOB CALENDAR TODAY MORE THAN 10000 JOBS NOTIFICATION THIS YEAR NGS GNT

Good News: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10,143 ప్రభుత్వ ఉద్యోగాలు రెడీ.. నేడుజాబ్‌ క్యాలెండర్‌ విడుదల

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. పది వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు.. ఎప్పుడు భర్తీ చేస్తారు అన్ని డిటైల్ తో జాబ్ క్యాలెండర్ ను సీఎం జగన్ రిలీజ్ చేయనున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు గుడ్ న్యూస్..? ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడుతోంది. ఏపీ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీ పోస్టులు, వాటి భర్తీకి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ రూపకల్పన కొలిక్కి వచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఆ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అవకాశం ఉన్న పోలీసు, విద్యా, వైద్య శాఖల్లో పోస్టుల వివరాలు, ఇతర ప్రభుత్వశాఖల్లో ఖాళీల వివరాలను పేర్కొనడంతో పాటు వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారు? ఆ జాబులకు సంబంధించి నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల చేస్తారు? వాటి రాత, మౌఖిక పరీక్షలు ఎప్పుడు ఉంటాయనే స్పష్టమైన వివరాలన్నీ క్యాలెండర్‌లో పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ అధికారులు సమాచారాన్ని సేకరించి కొలిక్కి తీసుకొచ్చారు. ఏపీపీఎస్సీ అధికారుల సహకారమూ తీసుకుంటున్నారు.

    ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 2021-22 జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు దశలవారీగా ఉద్యోగుల భర్తీ చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఏటా ఉద్యోగాల ఖాళీలు ప్రకటించి, వాటిని భర్తీ చేయనున్నారు. నిరుద్యోగులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.

    ఇదీ చదవండి: కుప్పంలో ఏం జరుగుతోంది..? జూనియర్ ఎన్టీఆర్ ను తెరపైకి తెస్తున్నది ఎవరు?

    ముఖ్యంగా ఎప్పటి నుంచో ఖాళీగా విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019 జూన్‌ నుంచి ఇప్పటివరకు 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేశామంటోంది ప్రభుత్వం. రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులు అందరూ కలిపి మొత్తం 6,03,756 మందిని నియమించినట్టు లెక్కలు చెబుతోంది.

    ఇదీ చదవండి: విశాఖకు 3 వేల కోట్ల నిధులు.. త్వరలోనే రాజధాని తరలింపు.. సంకేతాలిచ్చిన ఎంపీ విజయసాయి

    2021, జూలై నుంచి నియమాకలు  జరగనున్న ఉద్యోగాల వివరాలు ఇవే

    జూలై-2021 ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్‌లాగ్‌ 1,238
    ఆగస్టు-2021 ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్‌ 36
    సెప్టెంబర్‌-2021 పోలీస్‌ శాఖ ఉద్యోగులు 450
    అక్టోబర్‌ - 2021 వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 451
    నవంబర్‌ -2021 పారామెడికల్‌ సిబ్బంది 5,251
    డిసెంబర్‌ - 2021 నర్సులు 441
    జనవరి -2022 డిగ్రీ కాలేజీల లెక్చరర్లు 240
    ఫిబ్రవరి -2022 వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 2,000
    మార్చి -2022 ఇతర శాఖలు 36
    భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు: 10,143
    ఇంకెదుకు ఆలస్యం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిరోద్యుగుల.. ఆయా ఆర్హతలు మీకుండా పరీక్షలు సిద్ధమైపోండి..
    Published by:Nagesh Paina
    First published: