Home /News /jobs /

GOOD NEWS FOR CBSC STUDENTS RESULT SOON UNEXPECTED WEIGHTAGE UMG GH

CBSE Results: సీబీఎస్సీ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్.. ఊహించని విధంగా వెయిటేజీ.. చూస్తే ఎగిరి గంతేస్తారు !

 సీబీఎస్సీ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ త్వరలో ఫలితాలు. . ఊహించని  విధంగా వెయిటేజీ .. చూస్తే ఎగిరి గంతేస్తారు !

సీబీఎస్సీ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ త్వరలో ఫలితాలు. . ఊహించని విధంగా వెయిటేజీ .. చూస్తే ఎగిరి గంతేస్తారు !

టర్మ్1, టర్మ్ 2‌ రెండింటికి సమాన వెయిటేజీ(Weightage) ఇస్తామని గతంలో బోర్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టర్మ్-2 పరీక్షల సమయంలో కరోనా పరిస్థితులు మెరుగవ్వడం, వార్షిక పరీక్షల పేరుతో చాలా టెస్ట్‌(Tests)లు నిర్వహించడంతో టర్మ్-2 పరీక్షలకు బోర్డు మరింత వెయిటేజీ ఇవ్వడానికి మొగ్గు చూపుతోంది.

ఇంకా చదవండి ...
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలను ఇంకా ప్రకటించలేదు. జులై చివరి వారంలో 12వ తరగతి, ఆగస్టు మొదటి వారంలో 10వ తరగతి ఫలితాలు(Results) వెల్లడికానున్నట్లు సమాచారం. సీబీఎస్‌ఈ బోర్డు రెండు టర్మ్‌ల ఆధారంగా ఫలితాలను ప్రకటించడం ఇదే తొలిసారి. అయితే టర్మ్ 1 ఫలితాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. కాగా, ఇందులో ఏ విద్యార్థి ఉత్తీర్ణత లేదా ఫెయిల్ అయినట్లు సీబీఎస్‌ఈ ప్రకటించకపోవడం గమనార్హం. టర్మ్1, టర్మ్ 2‌ రెండింటికి సమాన వెయిటేజీ ఇస్తామని గతంలో బోర్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టర్మ్-2 పరీక్షల సమయంలో కరోనా పరిస్థితులు మెరుగవ్వడం, వార్షిక పరీక్షల పేరుతో చాలా టెస్ట్‌లు నిర్వహించడంతో టర్మ్-2 పరీక్షలకు బోర్డు మరింత వెయిటేజీ ఇవ్వడానికి మొగ్గు చూపే అవకాశం ఉంది.

వివిధ అవాంతరాల కారణంగా టర్మ్ 1 బోర్డు పరీక్షలను వివాదాలు చుట్టుముట్టాయి. 10వ తరగతి ఇంగ్లీష్(English) పరీక్షలో సెక్సిస్ట్ పాసేజ్ వివాదం రేపింది. దీంతో దిగివచ్చిన బోర్డు ఈ పాసేజ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా, విద్యార్థులందరికీ పూర్తి మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక 12వ తరగతి సోషియాలజీ పరీక్షలో కూడా గుజరాత్ హింసపై ఓ ప్రశ్న వచ్చింది. దీనిపై ఎలాంటి వివాదం చెలరేగకముందే, పరీక్ష ముగిసిన కొద్దిసేపటికే సీబీఎస్‌ఈ క్షమాపణలు చెప్పింది.

వివిధ రిపోర్ట్‌ల ప్రకారం.. టర్మ్-1 తుది ఫలితాల్లో 30 శాతం వెయిటేజీ, టర్మ్-2 ఫలితాలకు 70 శాతం వెయిటేజీ ఇవ్వవచ్చు. అయితే దీనిపై బోర్డు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తుది ఫలితాలతో పాటు ఫలితాలను ఏ పార్ములా ప్రకారం లెక్కించామనే వివరాలను కూడా ప్రకటిస్తామని సీబీఎస్‌ఈ గతంలో తెలిపింది.

రెండు టర్మ్‌ల్లో ఒకదాన్ని రాయలేకపోయినా ఫలితాలను లెక్కిస్తామని సీబీఎస్‌సీ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో టర్మ్ 1 పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు, టర్మ్ 2 పరీక్షలకు హాజరు కావడానికి అనుమతి లభించింది. ఈ విద్యార్థులు ఇతర విద్యార్థిలాగే తమ ఫలితాలను పొందుతారు. అయితే, పరీక్షలకు హాజరుకాకపోవడానికి బలమైన కారణం ఉండాలి. వాటికి ఆమోదం లభిస్తే.. అటువంటి విద్యార్థులకు ఫలితాన్ని లెక్కించడానికి సీబీఎస్‌ఈ ఒక మార్గాన్ని కనుగొంటుంది.

ఇదీ చదవండి:  Air Ambulance: అద్భుతం..గుండె ఆపరేషన్ కోసం .. అమెరికా నుంచి చెన్నైకు ఎయిర్ అంబులెన్స్.. చదివితే చేతులెత్తి మొక్కుతారు !


మరోపక్క టర్మ్ 1 పరీక్షల తుది ఫలితాల్లో దాదాపు 10 నుంచి 30 శాతం వెయిటేజీ ఉండాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన మార్కులను టర్మ్ 2, ఇంటర్నల్ అసెస్‌మెంట్ స్కోర్‌లకు కేటాయించాలని కోరుతున్నారు. అంతేకాకుండా తుది ఫలితాలను కంప్యూటింగ్ చేయడానికి రెండు టర్మ్‌లలో దేనిలోనైనా ఉత్తమ స్కోర్‌ను సూచించే నిబంధనలనే పరిగణనలోకి తీసుకోవాలని కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.



కాగా, టర్మ్ 1 పరీక్షలకు 30 శాతం వెయిటేజీ ఉంటుందని గతంలో సీబీఎస్‌ఈ సర్క్యులర్‌ జారీ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అది నకిలీదని తేలింది. తుది వెయిటేజీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సీబీఎస్‌ఈ అప్పుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, CBSE, Cbse results, JOBS

తదుపరి వార్తలు