హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE 10th, 12th Result 2022: సీబీఎస్సీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్క్స్ షీట్ లో తప్పులు సరిదిద్దుకునే అప్షన్ ..! ఇలా చేస్తే చాలు ?

CBSE 10th, 12th Result 2022: సీబీఎస్సీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్క్స్ షీట్ లో తప్పులు సరిదిద్దుకునే అప్షన్ ..! ఇలా చేస్తే చాలు ?

సీబీఎస్సీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్క్స్ షీట్ లో తప్పులు సరిదిద్దుకునే అప్షన్ ..! ఇలా చేస్తే చాలు ?

సీబీఎస్సీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్క్స్ షీట్ లో తప్పులు సరిదిద్దుకునే అప్షన్ ..! ఇలా చేస్తే చాలు ?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) జులై 15 నాటికి 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. CBSE అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.inలో ఫలితాలను చూసుకోవచ్చు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) జులై 15 నాటికి 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఫలితాలు ప్రకటించిన తర్వాత, విద్యార్థులు CBSE అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.inలో ఫలితాలను చూసుకొనే సదుపాయం ఉంది. అయితే, విద్యార్థులు ఆన్‌లైన్ మార్క్‌షీట్‌లను పొందిన తర్వాత, తమ మార్కులను తనిఖీ చేయడమే కాకుండా, దానిపై అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయా ? లేదా ? నిర్ధారించుకోవాలి.

10, 12వ తరగతి మార్కుషీట్‌లు విద్యార్థి జీవితంలో చాలా ముఖ్యమైనవి. గ్రాడ్యుయేషన్, తదుపరి విద్య, ఉపాధికి కూడా ఈ పత్రాలు కీలకం. ఈ పత్రాలలో ఏవైనా లోపాలు ఉంటే విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుంది. విద్యార్థుల మార్క్‌షీట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, స్కోర్‌లతో పాటు, అభ్యర్థుల వ్యక్తిగత సమాచారం కూడా అందుతుంది.  మార్క్‌షీట్‌లో ఏ వివరాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలో తెలుసుకోండి.

- విద్యార్థి పేరు

- రోల్ నంబర్

- తండ్రి పేరు

- తల్లి పేరు

- మొత్తం మార్కులు

- పర్సంటేజ్‌ లెక్కింపు

- పాఠశాల పేరు

- గ్రేడ్‌లు

- పాస్/ ఫెయిల్

CBSE 10వ, 12వ ఫలితాలు 2022 : మార్క్‌షీట్‌లో లోపాలను ఎలా సరిదిద్దాలి

మార్క్‌షీట్‌లో తప్పుగా వచ్చిన జాపేర్లు, తల్లిదండ్రుల పేర్లు సరిదిద్దడానికి CBSE విద్యార్థులకు అవకాశాన్ని అందిస్తుంది. మార్క్‌షీట్‌లో దిద్దుబాట్లు చేసుకునేందుకు ఇకపై శ్రమపడాల్సిన అవసరం లేదు. విద్యార్థులు CBSE మార్క్‌షీట్‌లో ఇలా మార్పులు చేసుకోవచ్చు..

బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbse.nic.inలో వివిధ అప్లికేషన్‌లు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు CBSE మార్క్‌షీట్‌లో పేరు దిద్దుబాటు కోసం అప్లికేషన్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అదే విధంగా అప్లికేషన్‌లను ప్రతి సంబంధిత పాఠశాల ప్రవేశ కార్యాలయంలో కూడా తీసుకోవచ్చు.

అవసరమైన డీటైల్స్‌తో అప్లికేషన్‌ను పూర్తి చేయాలి.  తిరిగి పొరపాట్లు రాయకుండా అప్రమత్తంగా ఉండాలి.

తర్వాత అవసరమైన పత్రాలను సమర్పించాలి. పాఠశాల రికార్డులను ధ్రువీకరించిన తర్వాత బోర్డు అవసరమైన దిద్దుబాట్లను చేస్తుంది.

ఇదీ చదవండి: కరోనా‌తో కాదు అదేదో కొత్త రకం ఐస్‌క్రీమ్‌తో.. దీని స్పెషాలిటీ ఏంటంటే..?


CBSE బోర్డు ఫలితం 2022 టర్మ్ 2 ఫలితాలను తెలుసుకోవడానికి.. విద్యార్థులకు రోల్ నంబర్, పుట్టిన తేదీ, పాఠశాల నంబర్ అవసరం. విద్యార్థులు టర్మ్‌ 2 ఫలితాలను చూసుకునే సమయంలో.. తుది ఫలితాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఫైనల్‌ స్కోర్‌ అనేది టర్మ్‌ 1, టర్మ్‌ 2 మార్కులపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నల్‌ మార్కులు, ప్రాక్టికల్‌ ఫలితాలను కూడా యాడ్‌ చేస్తారు. ప్రతి టర్మ్‌ నుంచి ఎంత శాతం మార్కులను తీసుకుని ఫైనల్‌ స్కోర్‌ నిర్ణయిస్తారనే అంశంలో స్పష్టత లేదు. అయితే ఫలితాలతో పాటే ఏ ఫార్ములాను ఉపయోగించి ఫైనల్‌ స్కోర్‌ నిర్ణయించారనే అంశంపై స్పష్టత వస్తుంది.

CBSE ఈ సంవత్సరం 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను కొత్త ఫార్మాట్‌లో నిర్వహించింది. వార్షిక పరీక్షా విధానం కాకుండా, ఈసారి, ప్రతి తరగతికి రెండు టర్మ్‌లలో బోర్డు పరీక్షలు నిర్వహించారు. టర్మ్ 1లో, విద్యార్థులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉండగా, టర్మ్ 2 పరీక్షలు సబ్జెక్టివ్‌గా ఉన్నాయి.

First published:

Tags: Cbse results, EDUCATION, Exam results, JOBS

ఉత్తమ కథలు