Home /News /jobs /

GOOD NEWS FOR CANDIDATES WHO HAVE COMPLETED THEIR DEGREE NOTIFICATION FOR MANY POSTS IN IRCON KNOW DETAILS HERE VB

IRCON Recruitment 2022: డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. IRCONలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

IRCON Recruitment 2022: డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. IRCONలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

IRCON Recruitment 2022: డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. IRCONలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

IRCON Recruitment 2022: IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 31 పోస్టులను భర్తీ చేస్తారు. పూర్తి వివరాలు ircon.orgవెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్(Recruitment Drive) ద్వారా 31 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిని అభ్యర్థులు దరఖాస్తులను అభ్యర్థులు ircon.org సైట్‌ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి దరఖాస్తు చేసుకోవడినికి చివరి తేదీ 17 ఆగస్టు 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. జూలై 29 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 19 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ మరియు 12 టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తారు.

Postal Assistant Jobs: పోస్టల్ అసిస్టెంట్(PA/SA) నియామకాలపై కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ లో పలు మార్పులు..


ఖాళీ వివరాలు
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: 19 పోస్టులు

టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్: 12 పోస్టులు

అర్హతలు..
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అయితే డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.



వయోపరిమితి
నోటిఫికేషన్ ప్రకారం.. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది .

స్టైపెండ్
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు: నెలకు రూ. 10,000
టెక్నీషియన్ (డిప్లొమా) హోల్డర్స్: నెలకు రూ. 8,500

ఇలా దరఖాస్తు చేసుకోండి..

- దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ ircon.orgని సందర్శించండి.

- ఆ తర్వాత అభ్యర్థి హోమ్‌పేజీలో ఇచ్చిన కెరీర్ సెక్షన్‌పై క్లిక్ చేయండి.

-ఇప్పుడు అభ్యర్థి సంబంధిత పోస్ట్‌ను ఎంచుకుని, దరఖాస్తుపై క్లిక్ చేయాలి.

-ఇక్కడ అభ్యర్థులు అవసరమైన వివరాలు మరియు పత్రాలను అప్‌లోడ్ చేసి.. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, దాని ప్రింట్ అవుట్‌ను తీసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 29 జూలై 2022.

దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేదీ: 17 ఆగస్టు 2022.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central governmennt, Central Government Jobs, Ircon, JOBS

తదుపరి వార్తలు