ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... రీకౌంటింగ్ దరఖాస్తు గడువు పెంపు

AP Inter Results 2020 | ఇంటర్ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయా? మీ మార్కుల్ని రీకౌంటింగ్ చేయించాలనుకుంటున్నారా? మీ జవాబు పత్రాన్ని రీవెరిఫికేషన్ చేయాలనుకుంటున్నారా? దరఖాస్తు గడువు పెంచింది ఏపీ ప్రభుత్వం.

news18-telugu
Updated: June 23, 2020, 11:31 AM IST
ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... రీకౌంటింగ్ దరఖాస్తు గడువు పెంపు
ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... రీకౌంటింగ్ దరఖాస్తు గడువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్ విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శుభవార్త చెబ్బింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పేపర్స్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు గడువును జూన్ 29 వరకు పొడిగించింది ఇంటర్ బోర్డు. వాస్తవానికి ఈ గడువు జూన్ 22న ముగిసింది. కానీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోరిక మేరకు దరఖాస్తు గడువును మరో వారం రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆసక్తి గల విద్యార్థులు ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ ఓపెన్ చేసి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయొచ్చు. జూన్ 29 వరకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు జూన్ 12న విడుదలైన సంగతి తెలిసిందే.

AP Inter Results 2020, Inter Results 2020, AP Inter Results reverification, AP Inter Results recounting last date, Board of Intermediate Education, ఏపీ ఇంటర్ ఫలితాలు 2020, ఇంటర్ ఫలితాలు 2020, ఏపీ ఇంటర్ రీకౌంటింగ్, ఏపీ ఇంటర్ రీవెరిఫికేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్

AP Inter Results 2020: రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయండిలా


ముందుగా https://bie.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
Student ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ లింక్ పైన క్లిక్ చేయండి.
హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి.Get Data పైన క్లిక్ చేసి వివరాలు సరిచూసుకోండి.
సబ్మిట్ పైన క్లిక్ చేసి ప్రాసెస్ పూర్తి చేయండి.
చివరగా దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
అప్లికేషన్ నెంబర్‌ను రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Govt Jobs: ఇంటర్ పాసయ్యారా? ఈ 669 ఉద్యోగాలకు అప్లై చేయండి

Andhra Pradesh Jobs: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు... ఎగ్జామ్స్ ఎప్పుడంటే

Govt Jobs: టెన్త్ పాసయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కండి

 
First published: June 23, 2020, 11:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading