• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • GOOD NEWS CENTRAL GOVERNMENT EMPLOYEES AND PENSIONERS FROM JULY 1ST THEY WILL GET GET FULL BENEFITS OF DEARNESS ALLOWANCE DA SS GH

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​... జూలై 1 నుంచి పెరగనున్న వేతనాలు

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​... జూలై 1 నుంచి పెరగనున్న వేతనాలు (ప్రతీకాత్మక చిత్రం)

7th Pay Commission | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్. ఏడవ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా జూలై 1 నుంచి వారి జీతాలు పెరగనున్నాయి.

  • Share this:
కోవిడ్-19 సంక్షోభం కారణంగా మొత్తం మూడు విడతల డీఏ పెంపును వాయిదా వేసిన కేంద్రం.. జూలై 1 నుంచి వాటిని అమలు చేయనుంది. దీంతో 50 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61 లక్షల మంది పెన్షనర్లకు లాభం చేకూరనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 17 శాతం డీఏ అమల్లో ఉంది. అయితే కరోనా కారణంగా గత ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వస్తున్న మూడు విడతల డీఏ.. జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇప్పటి వరకు 17 శాతంగా ఉన్న డీఏ, తాజా 11 శాతంతో కలిపి 28 శాతానికి చేరుకోనుంది. ఈ 11 శాతం డీఏ పెరిగిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నెలసరి జీతంలో పెద్ద మార్పు కనిపిస్తుంది.

IAF AFCAT 2 Recruitment 2021: ఎయిర్‌ఫోర్స్‌లో 334 ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

UIDAI Recruitment 2021: ఆధార్ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఫిట్​మెంట్​పై ఆధారపడి ఉంటుంది, ఈ ఫిట్​మెంట్​ పెరిగితే.. బేసిక్​ పే కూడా పెరుగుతుంది. మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయి ఉంటే మీ బేసిక్​ పేను 2.57తో గుణించి మొత్తం జీతాన్ని లెక్కగట్టాలి. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్​ పే రూ.18,000 అయితే అతని మొత్తం జీతాన్ని లెక్కించేందుకు 2.57తో గుణించాలి. తద్వారా సదరు ఉద్యోగి అన్ని అలవెన్సులు కలుపుకొని నెలకు రూ. 46,260 పొందవచ్చు. ఇక పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏ అమలు చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే, కరోనాతో ఇప్పటివరకు మూడు డీఏలు ఆగిపోయాయి. వాటిని జూలై 1 నుంచి చెల్లిస్తే జీతం పెద్ద మొత్తంలో పెరగనుంది.

7th Pay Commission: పెన్షన్​ విధానంలో మార్పులు... పెరిగిన ఫ్యామిలీ పెన్షన్​ లిమిట్

NIMHANS Recruitment 2021: నిమ్‌హాన్స్‌లో 275 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

మొత్తం 11 శాతం పెరగనున్న డీఏ


డీఏ పెండింగ్​ బకాయిలపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మార్చి 9న రాజ్యసభలో మాట్లాడారు. కరోనా కారణంగా పెండింగ్‌లో ఉన్న మూడు డీఏ బకాయిలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని, వీటి రేట్లు సవరించిన రేట్లకు అనుగుణంగా ఉంటాయని తెలిపారు. ఈ మేరకు ఆయన రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం డీఏను 17 శాతం చొప్పున చెల్లిస్తున్నారు. 2020 జనవరి నుంచి జూన్ వరకు 4 శాతం, 2020 జూలై నుంచి డిసెంబర్ వరకు 3 శాతం, 2021 జనవరి నుంచి జూన్ వరకు 4 శాతం డీఏ పెరుగుదల అమల్లోకి రానుంది. ఫలితంగా 11 శాతం మొత్తం డీఏ పెరగనుంది. దీంతో డీఏ మొత్తం 28 (17 + 4 + 3 +4) శాతానికి చేరుకోనుంది. ఇక, జూలై 1 నుంచి ఉద్యోగుల డీఏతో పాటు ఎంప్లాయిస్​ ప్రావిడెంట్​ ఫండ్​కు సహకారం, గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది. ఉద్యోగి బేసిక్​ పేలో నుంచి 12 శాతం వారి ఈపీఎఫ్​లో ప్రతినెలా జమ అవుతుంది.
Published by:Santhosh Kumar S
First published: