హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Goldman Sachs: ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చిన గోల్డ్‌మన్ శాక్స్ కంపెనీ​.. ఆ సమయాల్లో వేతనంతో కూడిన సెలవులు

Goldman Sachs: ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చిన గోల్డ్‌మన్ శాక్స్ కంపెనీ​.. ఆ సమయాల్లో వేతనంతో కూడిన సెలవులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాకు చెందిన దిగ్గజ ఫైనాన్షియల్​ బ్యాంక్​ గోల్డ్‌మ్యాన్ శాక్స్ (Goldman Sachs)​ తన ఉద్యోగులకు (Employees) గుడ్​న్యూస్​ చెప్పింది. తాజాగా ప్రవేశపెట్టిన ఎంప్లాయిస్ బెనిఫిట్స్​ లిస్ట్​లో అనేక ప్రయోజనాలను చేర్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

అమెరికా(America)కు చెందిన దిగ్గజ ఫైనాన్షియల్​ బ్యాంక్​ గోల్డ్‌మ్యాన్ శాక్స్ (Goldman Sachs)​ తన ఉద్యోగులకు (Employees) గుడ్​న్యూస్​ చెప్పింది. తాజాగా ప్రవేశపెట్టిన ఎంప్లాయిస్ బెనిఫిట్స్​ లిస్ట్​లో అనేక ప్రయోజనాలను చేర్చింది. ఉద్యోగి జీవిత భాగస్వామి గర్భం దాల్చితే లేదా అద్దె గర్భ ద్వారా బిడ్డకు ప్రసవిస్తే 20 రోజుల వేతనంతో కూడిన సెలవు (Paid Leaves) తీసుకోవడానికి అనుమతిస్తుంది. ఒకవేళ, దురదృష్టవశాత్తూ ఉద్యోగి కుటుంబ సభ్యుడు మరణిస్తే 20 రోజుల వేతనంతో కూడిన కుటుంబ సంరక్షణ సెలవును కూడా మంజూరు చేస్తామని ప్రకటించింది. తద్వారా బాధలో ఉన్న కుటుంబంతో (Family) సమయాన్ని గడపడానికి, ప్రయాణం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఈ వెసులుబాటు కల్పిస్తున్పట్లు తెలిపింది. మరోవైపు, 15 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఉద్యోగులకు ఆరు వారాల పాటు వేతనం లేని సెలవును మంజూరు చేస్తామని ప్రకటించింది. ఆ తర్వాత సంస్థలో పనిచేసిన ప్రతి ఐదేళ్ల సర్వీసుకు అదనంగా రెండు వారాలు పాటు సెలవులు మంజూరు చేస్తామని తెలిపింది.

అయితే తాజాగా ప్రవేశపెట్టిన ఎంప్లాయి బెనిఫిట్స్​పై గోల్డ్‌మన్ శాక్స్​ హ్యూమన్​ క్యాపిటల్​ హెడ్​ బెంట్లీ డి బేయర్ మాట్లాడుతూ "మా ఉద్యోగులు తమను, తమ కుటుంబాలను చూసుకోవడానికి సమయం ఇవ్వాలని నిర్ణయించాం. అందుకోసం కీలక సమయాల్లో వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేయాలని నిర్ణయించాం. ఉద్యోగుల అభివృద్ధికి తోడ్పడేలా ఆప్టిమైజేషన్, రెసిలెన్స్, మానసిక ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. మా ఉద్యోగులకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అన్ని విధాలుగా తోడుంటామనే భరోసానిచ్చేందుకు కంపెనీ ఈ సరికొత్త విధానాన్ని ప్రకటించింది.” అని చెప్పారు.

IIT Gandhinagar: ఐఐటీ​లో ఇంటర్న్‌షిప్.. రూ. 28 వేల స్టైఫండ్.. కేవలం మూడు రోజులే అవ‌కాశం​

భారత్​లోనే రెండో అతిపెద్ద కార్యాలయం..

గోల్డ్‌మన్ శాక్స్​ సర్వీసెస్ బ్యాంక్​కు న్యూయార్క్ తర్వాత రెండవ అతిపెద్ద కార్యాలయం మన దేశంలోని బెంగళూరులోనే ఉంది. గోల్డ్‌మన్ శాక్స్ బెంగళూరు కార్యాలయంలో 7,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక, హైదరాబాద్‌లోని గోల్డ్​మన్​ శాక్స్​ కార్యాలయంలో 350 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్యం, కుటుంబ సభ్యులను కోల్పోయిన సందర్భాల్లో వారి సంరక్షణ కోసం 4 వారాల వేతనంతో కూడిన సెలవును అమలు చేస్తుంది.

BHEL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. BHELలో రూ. 70 వేల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

రెండు సంవత్సరాల క్రితం ఈ బ్యాంక్ 26 వారాలకు సమానమైన పేరెంటల్​ లీవ్స్​ను ప్రకటించింది. ఇటీవల తన ఉద్యోగులకు ఓ బంపరాఫర్​ ప్రకటించి వార్తల్లో నిలిచింది. వర్క్​ ఫ్రమ్​ హోమ్​ వదిలేసి ఆఫీసులకు వచ్చే ఉద్యోగులకు బ్రేక్​ ఫాస్ట్​, లంచ్​ ఏర్పాటు చేస్తామని తెలిపింది. అంతేకాదు ప్రముఖ ఐస్​క్రీమ్​ షాప్​ నుంచి ఐస్​క్రీమ్​లను కూడా తెప్పించి ఇస్తామని పేర్కొంది.

First published:

Tags: Employees, Full salary, Private Jobs

ఉత్తమ కథలు