గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ (Gujarat Metro Rail Corporation) కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిపికేషన్ ద్వారా స్టేషన్ కంట్రోలర్/ ట్రైన్ ఆపరేటర్, కస్టర్ రిలేషన్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, మెయింటేనర్ పోస్టులు భర్తీ చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 22, 2021 న ప్రారంభమైంది. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ (Online) దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి చివరి తేదీ జనవరి 21, 2022 వరకు అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.33,000 నుంచి రూ.60,000 వరకు వేతనం (Salary) చెల్లిస్తారు. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ (Notification), దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ www.gujaratmetrorail.com లో GMRC యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.
పోస్టుల వివరాలు.. అర్హతలు
పోస్టు పేరు | అర్హతలు | పోస్టుల సంఖ్య |
స్టేషన్ కంట్రోలర్/ ట్రైన్ ఆపరేటర్ | గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయంలో మెకానికల్ / ఎలక్ట్రికల్ / కంప్యూటర్, సైన్స్ లేదా ఎలక్ట్రానిక్ డిసిప్లిన్‌లో ఇంజనీరింగ్ డిప్లమా చేసి ఉండాలి. | 71 |
కస్టమర్ రిలేషన్ అసిస్టెంట్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో సైన్స్ గ్రాడ్యుయేట్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చేసి ఉండాలి. | 13 |
జూనియర్ ఇంజనీర్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్ విభాగంలో ఇంజనీరింగ్ లేదా డిప్టమా చేసి ఉండాలి. | 03 |
మెయింటేనర్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిట్టర్ / ఎలక్ట్రీషియన్/ ఎలక్ట్రానిక్స్) లో ITI (రెండేళ్లు)తో SSLC ఉత్తీర్ణత సాధించాలి. | 33 |
Jobs in Andhra Pradesh: డిగ్రీ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రీజియన్‌లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!
ఎంపిక విధానం..
Step 1 : ఆన్‌లైన్ (Online) దరఖాస్తులను సంస్థ పరిశీలిస్తుంది.
Step 2 : వాటని పరిశీలించి అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
Step 3 : అభ్యర్థులు సబ్‌మిట్ చేసి దరఖాస్తులో తప్పుడు సమాచారం ఉంటే ఏ క్షణమైన ఉద్యోగం నుంచి తొలగిస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతి (Online System)లో ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.gujaratmetrorail.com ను సందర్శించాలి.
Jobs in Telangana: డిగ్రీ అర్హతతలో ఈఎస్ఐసీలో 72 ఉద్యోగాలు.. ప్రారంభమైన అప్లికేషన్ ప్రాసెస్!
Step 3 : అనంతరం నోటిఫికేషన్ (Notification)ను పూర్తిగా చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : అనంతరం అప్లికేషన్ లింక్ https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8= ను క్లిక్ చేయాలి.
Step 5 : ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫాంను పూర్తిగా నింపాలి.
Step 6 : అప్లికేషన్ నింపిన తరువాత జనరల్ అభ్యర్థులు రూ.600, ఓబీసీ అభ్యర్థులు రూ.300, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ150 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
Step 7 : అనంతరం ఫాంను సబ్‌మిట్ చేయాలి.
Step 8 : ఫాం సబ్‌మిట్ చేసిన తరువాత అప్లికేషన్ (Application) ను ప్రింట్ తీసుకొని హార్డ్ కాపీని దాచుకోవాలి.
Step 9 : ఈ పోస్టుల దరఖాస్తుకు జనవరి 21, 2022 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Engineering, Gujarat, Job notification, JOBS, Metro Train