నిరుద్యోగులకు గుడ్ న్యూస్. చిత్తూరు జిల్లా తిరుపతిలోని ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 34 ఖాళీలున్నాయి. ల్యాబ్ టెక్నీషియన్, థియటర్ అసిస్టెంట్, ఏఎన్ఎం, ల్యాబ్ అటెండెంట్, అటెండీ, వార్డ్ బాయ్, స్ట్రెచర్ బేరర్ లాంటి పోస్టులున్నాయి. ఇవి ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. తిరుపతిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రిలో ఏడాది గడువు ఉన్న పోస్టులు ఇవి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 మార్చి 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చిత్తూరు జిల్లా అధికారిక వెబ్‌సైట్ https://chittoor.ap.gov.in/ లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు, ఇతర అర్హతలు తెలుసుకోవాలి. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు https://chittoor.ap.gov.in/ లేదా http://www.svmctpt.edu.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. లేదా స్వయంగా దరఖాస్తు ఫామ్ ఇవ్వాలి.
GMH Tirupati Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 17
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 26 సాయంత్రం 5 గంటలు
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
వయస్సు- 2020 డిసెంబర్ 31 నాటికి 42 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.300
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Superintendent,
Govt. Maternity Hospital,
Tirupati.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.