GK Capsule : ప్రస్తుతం అన్ని రకాల పోటీపరీక్షల్లో జనరల్ నాలెడ్జ్(Geeral knowledge) విభాగం కీలకంగా మారింది. UPSC సివిల్ సర్వీసెస్ నుంచి SSC రిక్రూట్మెంట్ పరీక్షల వరకు, కాలేజీ అడ్మిషన్ల నుంచి గ్రూప్ డిస్కషన్ల వరకు జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం News18 వారానికోసారి కాలమ్- GK క్యాప్సూల్‌ను అందిస్తోంది. అభ్యర్థులు నిర్దిష్ట అంశం లేదా పరీక్షపై మరింత సమాచారాన్ని పొందడానికి @news18dotcomని సంప్రదించవచ్చు.
భవిష్యత్తులో పోటీ పరీక్షలు రాయనున్న వారు ఎప్పటికప్పుడు వర్తమాన అంశాలపై అవగాహన పెంచుకోవడం అవసరం. కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యమైన అంశాలను కవర్ చేయడం అభ్యర్థులకు కాస్త శ్రమతో కూడుకున్న పనే. అందుకే ప్రిపరేషన్లో సాయం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్యమైన ఈవెంట్ల వివరాలను న్యూస్18 అందిస్తోంది.
ముంబై- అహ్మదాబాద్ వందే భారత్ మార్గంలో కంచెల ఏర్పాటు
జంతువులు రైల్వే ట్రాక్‌లపైకి వెళ్లకుండా, రైలు ప్రమాదాలకు గురికాకుండా నిరోధించడానికి, వచ్చే ఏడాది మే నాటికి ముంబై- అహ్మదాబాద్ రైలు మార్గంలో కంచెలు ఏర్పాటు చేస్తామని పశ్చిమ రైల్వే (WR) ప్రకటించింది. ఇటీవల ముంబై- అహ్మదాబాద్ మధ్య వందే భారత్ రైలు పశువులను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు రెండు నెలల్లోనే నాలుగు సార్లు చోటు చేసుకున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ కంచెల కోసం భూమి నుంచి 1.5 మీటర్ల ఎత్తుతో w-బీమ్ స్ట్రక్చర్లు నిర్మిస్తారు.
రెండు బిల్లులను ఆమోదించిన ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ప్రభుత్వ ఉద్యోగాలు , విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర మొత్తం కోటాను 76 శాతానికి పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లకు ఆమోదం తెలిపింది. బిల్లుల ప్రకారం ఎస్సీ, ఓబీసీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల కోటా వరుసగా 32 శాతం, 27 శాతం, 13 శాతం, 4 శాతానికి సవరించారు.
Bihar Women: ఉపాధి పొందుతూ ఉద్యమం.. మద్య నిషేధాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లిన బీహార్ మహిళలు..
నవంబర్ 18తో ముగిసిన పక్షం రోజులలో, భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ఔట్‌స్టాండింగ్ క్రెడిట్ గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 16.96% పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. 2022 నవంబర్ 19 నాటి బ్యాంక్ క్రెడిట్ రూ.133.29 లక్షల కోట్లుగా ఉంది. అదే గత ఏడాది ఇదే కాలానికి రూ.113.96 లక్షల కోట్లు మాత్రమే ఉంది. ఆర్థిక సంవత్సరం 2023లో క్రెడిట్ వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో అనేక కారణాల వల్ల స్థిరంగా పెరిగింది. 2021–2022 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ క్రెడిట్ 8.59% పెరిగింది, డిపాజిట్లు 8.94% పెరిగాయి.
ఢిల్లీ గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీ
సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) ప్రకారం.. దేశ రాజధానిలో మొత్తం గాలి నాణ్యత 323 AQIతో 'వెరీ పూర్' కేటగిరీలో ఉంది. కాలుష్య పొగ నుంచి ఎటువంటి ఉపశమనం లేదు. గాలిలో PM 2.5, PM 10 సాంద్రతలు రెండూ వరుసగా 323, 211 వద్ద కనుగొన్నారు. ఇవి వెరీ పూర్, పూర్ కేటగిరీలను సూచిస్తాయి. ఢిల్లీ పొరుగు నగరాలు, నోయిడా, గురుగ్రామ్‌లో గాలి నాణ్యత మరింత క్షీణతను సూచిస్తోంది.
4వ విడత భారత్ బాండ్ ఈటీఎఫ్
నాలుగో విడత భారత్ బాండ్ ఈటీఎఫ్‌ను ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భారత్ బాండ్ ఈటీఎఫ్ అనేది భారతదేశపు మొట్టమొదటి కార్పొరేట్ బాండ్ ఈటీఎఫ్. ఇది భారత ప్రభుత్వ పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం ప్రాజెక్ట్. ఈ కొత్త భారత్ బాండ్ ఈటీఎఫ్, భారత్ బాండ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్ఓఎఫ్) సిరీస్‌లు 2033 ఏప్రిల్‌లో మెచ్యూర్ అవుతాయి. ఈ కొత్త సిరీస్ నాలుగో విడత ప్రవేశపెట్టడం ద్వారా రూ.4,000 కోట్లలో గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా రూ.1000 కోట్ల ప్రారంభమొత్తాన్ని జనరేట్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. గతేడాది మూడో విడతలో డిసెంబర్లో రూ.1,000 కోట్ల మూలధనంతో ప్రభుత్వం లాంచ్ చేసింది.
చార్లెస్ మిచెల్‌తో జీ జిన్‌పింగ్ భేటీ
EU కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్‌తో, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ఇందులో COVID-19 మహమ్మారితో అలసిపోయిన యువకులు చైనా నగరాల్లో ఇటీవల నిరసనలకు కారణమయ్యారని జిన్‌పింగ్ ఆరోపించారు. చైనాలోని COVID-19 వైరస్ ఇప్పుడు ఓమిక్రాన్ వేరియంట్‌కి చెందినదని, ఇది డెల్టా వేరియంట్ కంటే తక్కువ ప్రాణాంతకమని ఆయన పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Air Pollution, CAREER, General knowledge