హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

GK Capsule: కాంపిటీటివ్ ఎగ్జామ్స్ స్పెషల్.. గత వారం టాప్ న్యూస్, జీకే టాపిక్స్ ఇవే..

GK Capsule: కాంపిటీటివ్ ఎగ్జామ్స్ స్పెషల్.. గత వారం టాప్ న్యూస్, జీకే టాపిక్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

న్యూస్18 ప్రతి వారం అందించే జీకే క్యాప్సూల్‌లో భాగంగా గత వారం టాప్ న్యూస్, జీకే టాపిక్స్ ఇప్పుడు చూద్దాం..

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

పోటీ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్(General Knowledge)కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు అన్ని ఎంట్రన్స్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో(Exams) ఈ విభాగం నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి పరీక్షల్లో బెస్ట్ స్కోర్ సాధించాలంటే జీకే, సమకాలీన పరిస్థితులపై లోతైన అవగాహన ఉండాలి. న్యూస్18 ప్రతి వారం అందించే జీకే క్యాప్సూల్‌లో భాగంగా గత వారం టాప్ న్యూస్, జీకే టాపిక్స్(GK Topics) ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్‌లో ఇండియా కార్ రేసింగ్ లీగ్

భాగ్యనరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండియా కార్ రేసింగ్ లీగ్ అర్ధాంతరంగా ముగిసింది. శనివారం టెస్ట్ రేస్‌లు ప్రారంభం కాగా, ఆదివారం సమయం లేకపోవడం, కొన్ని ప్రమాదాలతో పూర్తి స్థాయిలో రేస్‌లు నిర్వహించలేకపోయారు. రేసర్లకు ప్రమాదాలు జరగడం కూడా రేసింగ్ నిలిపివేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా తెలుస్తోంది.

Notification Cancel: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు..

తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం సక్సెస్

ఇస్రో చరిత్రలో మరో మైలురాయి చేరింది. దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్‌ నింగిలోకి ప్రయోగించి సక్సెస్ సాధించింది. గత శుక్రవారం ఉదయం 11.30 గంటలకు శ్రీహరికోటలోని షార్‌లోని సౌండింగ్‌ రాకెట్‌ కాంప్లెక్స్‌ నుంచి తొలి ప్రైవేటు రాకెట్‌‌ను ప్రయోగించింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ప్రైవేటు సంస్థ ఈ రాకెట్ ను రూపొదించింది. దీనికి విక్రమ్‌-సబార్బిటల్‌ (వీకేఎస్‌)గా నామకరణం చేశారు. ఈ మొట్టమొదటి మిషన్‌కు ‘ప్రారంభ్‌’ అని పేరు పెట్టారు. స్పేస్‌ కిడ్స్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రాకెట్‌ను రూపొందించారు. విక్రమ్‌ -ఎస్‌ రాకెట్‌ 6 మీటర్ల పొడవు, 545 కిలోల బరువు ఉంది. ఈ రాకెట్ ద్వారా 3 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపారు.

నాసా ఆర్టెమిస్ మిషన్‌ సక్సెస్

మూడేళ్లలోగా మానవులను చంద్రుడిపైకి పంపించే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్‌ మిషన్‌లో తొలి దశ ఆర్టెమిస్‌-1 ప్రయోగం విజయవంతమైంది. ఇంధన లీకేజీ, హరికేన్లు, ఇంజన్‌ సమస్యలతో ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ ఈ ప్రయోగం నవంబర్ 16న ఎట్టకేలకు సక్సెస్ అయ్యింది. ఈ ప్రయోగంలో భాగంగా లాంచింగ్‌ వెహికల్స్‌లో అత్యంత శక్తిమంతమైన PLS.. మానవరహిత స్పేస్‌ క్యాప్సూల్‌ ఓరియన్‌ను తీసుకెళ్లింది. ఈ ప్రయోగాన్ని ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించారు.

సెలక్టర్ల కమిటీ‌పై బీసీసీఐ వేటు

ఇటీవల ఆస్ర్టేలియా వేదికగా జరిగిన టీ-20 వరల్డ్‌కప్‌లో భారత్ సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. దీంతో టీమ్ ఎంపికపై తీవ్ర విమర్శలు రావడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్టర్ల కమిటీని తొలగించింది. దీంతో ఖాళీగా ఉన్న స్థానానికి కొత్త దరఖాస్తుదారులను బోర్డు ఆహ్వానించింది.

TSPSC Exam Update: అభ్యర్థులకు అలర్ట్.. ఆ పరీక్ష షెడ్యూల్ విడుదల..

సెమీఫైనల్‌‌‌లోకి మణికా బాత్రా

భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మానికా బాత్రా ఆసియా కప్‌లో మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో గెలిచి, కాంస్య పతకం సాధించింది. దీంతో ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ పోటీలో పతకం గెల్చిన తొలి భారతీయ మహిళగా బాత్రా రికార్ట్ సృష్టించింది.

First published:

Tags: Gk, GK Capsule, Gk questions, JOBS

ఉత్తమ కథలు