పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు జనరల్ నాలెడ్జ్(GK), కరెంట్ అఫైర్స్ (Current Affairs), స్టాక్ జీకే టాపిక్స్‌పై పట్టు సాధించాలి. ప్రస్తుతం ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్, కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో (Competitive Exam) ఈ సెక్షన్‌ను పొందుపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల్లో మంచి స్కోర్ సాధించేందుకు ఈ సెక్షన్ కీలకంగా మారింది. మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతుంటే.. గత వారం జరిగిన అతి ముఖ్యమైన ఘటనలు, ఈవెంట్స్‌ను జీకే క్యాప్సూల్ రూపంలో పరిశీలిద్దాం.
ప్రత్యేక తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. ఈ మేరకు బీఆర్ఎస్గా పార్టీ పేరును మార్చుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. దసరా రోజున పార్టీ సమావేశంలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు.
SBI Recruitment 2022: ఎస్బీఐ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ ... ఖాళీలు, విద్యార్హతల వివరాలివే
న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్‌గా తెలుగు బిడ్డ డాక్టర్ ఎం. శ్రీనివాస్ ఎంపికయ్యారు. డాక్టర్ శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ESIC హాస్పిటల్, మెడికల్ కాలేజీకి డీన్‌గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు ఆయన ఎయిమ్స్-ఢిల్లీలో పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పదవీ విరమణ చేయడంతో అతని స్థానంలో శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు.
ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు రావడంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై ఎన్ఐఏ, ఈడీ దాడులు చేసింది. ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న పీఎఫ్ఐ ఆఫీసుల్లో సెప్టెంబరు 22న ఏకకాలంలో సోదాలు చేశారు. దాదాపు 106 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు. 15 రాష్ట్రాల్లోని 93 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి పీఎఫ్ఐ ఆఫీస్‌లను సీజ్ చేశారు.
Bank of Baroda Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో 346 ఉద్యోగాలు ... ఖాళీల వివరాలివే
బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ్ ఆగస్టు 10న వర్కవుట్ చేస్తుండగా అకస్మాతుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతన్ని హుటాహుటినా ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిపించారు. దాదాపు 40 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన, ఆరోగ్యం విషమించడంతో గత బుధవారం కన్నుమూశారు. ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖులు రాజు మృతికి సంతాపం తెలియజేశారు.
హిజాబ్ వ్యతిరేక అల్లర్ల కారణంగా ఇరాన్లో దాదాపు 50 మంది చనిపోయారు. అంతకు ముందుకు అమిని అనే యువతి ఇస్లామిక్ డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమె పోలీసుల అదుపులో ఉండగానే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఇరాన్లో ఒక్కసారిగా హింస చెలరేగింది. అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో 50 మంది ఇరానీలు చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటన గత శుక్రవారం జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.