Home /News /jobs /

GK CAPSULE FROM THE FALL OF THE RUPEE TO THE SRI LANKAN CRISIS GK CAPSULE IS HERE FOR YOU WITH IMPORTANT NEWS THIS WEEK GH VB

GK Capsule: ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అభ్యర్థులకు.. ఈ కరెంట్ అఫైర్స్ మీ కోసమే..

(ఫ్రతీకాత్మక చిత్రం)

(ఫ్రతీకాత్మక చిత్రం)

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నుంచి ఎస్సెస్సీ రిక్రూట్మెంట్ పరీక్షల వరకు, కాలేజీ అడ్మిషన్ల నుంచి గ్రూప్ డిస్కషన్ల వరకు.. పరీక్షలో విజయం సాధించడానికి అభ్యర్థుల కోసం న్యూస్18 నెట్‌వర్క్ ప్రతి వారం జీకే క్యాప్సూల్ అందిస్తుంది. ఈ వారం అంతర్జాతీయ వార్తలను న్యూస్ 18 వీక్లీలో చూడవచ్చు. జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన 5 మెయిన్ టాపిక్స్ ఏవో చూద్దాం.

ఇంకా చదవండి ...
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నుంచి ఎస్సెస్సీ రిక్రూట్మెంట్ పరీక్షల వరకు, కాలేజీ అడ్మిషన్ల నుంచి గ్రూప్ డిస్కషన్ల వరకు.. పరీక్షలో విజయం సాధించడానికి అభ్యర్థుల కోసం న్యూస్18 నెట్‌వర్క్ ప్రతి వారం జీకే క్యాప్సూల్ అందిస్తుంది. ఈ వారం అంతర్జాతీయ వార్తలను న్యూస్ 18 వీక్లీలో చూడవచ్చు. జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన 5 మెయిన్ టాపిక్స్ ఏవో చూద్దాం.

1. రూపాయి విలువ పతనం
డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకి పడిపోతోంది. గత కొంతకాలంగా భారత్ రూపాయి బలహీనపడింది. గురువారం అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.77.72గా ఉంది. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్ లో రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగినప్పటికీ.. ఎఫ్‌పీఐ అమ్మకాల ఒత్తిడి, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్య విధాన ప్రభావం కొనసాగింది. గత కొన్ని నెలలుగా రూపాయి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది జనవరి 22 న ఒక డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.73.77 గా ఉంది. ఆ తర్వాత రూ.4 గణనీయంగా పడిపోయి... గురువారం నాటికి రూ.77.72కి చేరుకుంది. అయితే, జనవరి 12 నుంచి మార్చి 8 వరకు రూపాయి విలువ బలహీనపడి రూ.77.13కి చేరింది. ఏప్రిల్ 5 వరకు బలపడి డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.75.23కి చేరుకుంది. ఏప్రిల్ 5 నుండి ఎన్నడు లేనంతంగా రూపాయి విలువ పడిపోయింది. అప్పటి నుంచి రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోయింది.

2. సంక్షోభంలో ఉన్న లంకకు కొత్త ప్రధాని
అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకకు బయటకు తీసుకురావటానికి మరో అడుగు ముందుకు పడింది. శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంకను పీడిస్తున్న అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభం వీలైనంత త్వరగా సమసిపోవాలంటే అనుభవజ్ఞుడైన విక్రమసింఘే లాంటి వాళ్లు అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. విక్రమసింఘే శ్రీలంక కొత్త ప్రధానిగా బాధ్యతలు అందుకుంటున్నారన్న విషయాన్ని యునైటెడ్ నేషనల్ పార్టీకి చెందిన వజిర అబేవర్థన్ అనే అధికారి వెల్లడించారు. రాజకీయ గందరగోళ మధ్య యూఎన్ పీ నేత రణిల్ విక్రమసింఘే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్సే దగ్గరుండి మరీ 73 ఏళ్ల విక్రమసింఘేతో లంక ప్రధానిగా ప్రమాణం చేయించారు. అధ్యక్ష భవనంలో ఈ కార్యక్రమం జరిగింది. తాజా మాజీ ప్రధాని మహీంద రాజపక్సే రాజీనామా చేయడంతో పాటు ఇతర కీలక రాజకీయ పార్టీల మధ్య రాజకీయ ప్రతిష్టంభన తర్వాత ప్రధానిగా విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు.

3. టెక్సాస్ స్కూల్‌లో భారతీయ విద్యార్థి వేధింపులు.. బాధితుడికి కఠిన శిక్ష

గత వారం అమెరికాలోని టెక్సాస్‌లో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. కొప్పెల్ నగరంలోని కొప్పెల్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ లో దారుణం జరిగింది ఇండియన్ అమెరికన్ స్టూడెంట్ ను శ్వేతజాతి క్లాస్‌మేట్ హింసాత్మకంగా వేధించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వ్యక్తులందరూ తెల్ల జాతీయుడిపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. బాధితురాలు షాన్ ప్రీత్మణికి మేనేజ్‌మెంట్ మూడు రోజులు శిక్ష విధించగా, దారుణానికి పాల్పడిన వ్యక్తికి ఒక రోజు మాత్రమే శిక్ష విధించారు.

4. శివలింగానికి రక్షణ.. నమాజ్ కు అనుమతి
ఙ్ఙానవాపి మసీదు కేసులో సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసీలో ఙ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లోని ఓ బావిలో శివలింగం బయటపడిన ఘటనపై వీడియోగ్రఫీ సర్వేను వ్యతిరేకిస్తూ ఙ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు స్పందించింది. ఙ్ఞానవాపి మసీదులో నమాజ్ చేసుకునేందుకు ముస్లింలకు అనుమతిచ్చింది. అదే సమయంలో శివలింగం బయటపడిన ప్రాంతానికి భద్రత కల్పించాలని ఆదేశించింది. ఙ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించే బాధ్యత కలెక్టరకు అప్పగించింది.

Astrology | Zodiac Signs: ఈ రాశుల వారు ఫ్రెండ్‌షిప్ అంటూనే అన్నీ కానిస్తారు.. మీ రాశి కూడా అదేనా..?


అంతకు ముందు జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌ వీడియో సర్వే నివేదికను ఈ నెల 19లోగా సమర్పించాలని వారణాసి న్యాయస్థానం ఆదేశించింది. అదే సమయంలో కోర్ట్ కమిషనర్‌ అజయ్ కుమార్ మిశ్రాను తొలగించింది. అజయ్ కుమార్ మిశ్రా పూర్తి స్థాయిలో సహకరించడం లేదనే ఆరోపణలు రావడంతో ఆయన్ను తొలగించింది. మరోవైపు నివేదిక సమర్పించేందుకు రెండు రోజుల సమయం కావాలని అసిస్టెంట్ కోర్ట్ కమిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. దీంతో కోర్టు 2 రోజుల గడువిచ్చింది.

5. బ్యాడ్మింటన్ లో భారత్ చరిత్ర.. స్వర్ణ పతకం

బ్యాడ్మింటన్ లో భారత్ చరిత్ర సృష్టించింది. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ లో ఆదివారం జరిగిన థామస్ కప్ టోర్నీ ఫైనల్లో పటిష్ట ఇండోనేషియాను భారత్ 3-0 తేడాతో చిత్తు చేసి స్వర్ణాన్ని ముద్దాడింది. ఫైనల్ లో భారత్ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన ముందు ఇండోనేషియా తలవంచక తప్పలేదు. ఆటగాళ్ల సమిష్ట ప్రదర్శనతో బ్యాడ్మింటన్ లో భారత్ ఎట్టకేలకు తొలిసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేత లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్, ప్రపంచ 8వ ర్యాంక్ డబుల్స్ ద్వయం చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయి రాజ్ రంకిరెడ్డి చిరస్మరణీయ ప్రదర్శనలతో ఇండోనేషియాపై ఇండియా ఘన విజయం సాధించింది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Gk, Telangana, Telangana government jobs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు