హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

GK Capsule: ఈ వారం జరిగిన ఘటనలతో.. TSPSC, UPSC, SSC కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ మీ కోసం..

GK Capsule: ఈ వారం జరిగిన ఘటనలతో.. TSPSC, UPSC, SSC కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ మీ కోసం..

GK Capsule: ఈ వారం జరిగిన ఘటనలతో.. TSPSC, UPSC, SSC కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ మీ కోసం..

GK Capsule: ఈ వారం జరిగిన ఘటనలతో.. TSPSC, UPSC, SSC కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ మీ కోసం..

న్యూస్ 18 జీకే క్యాప్సుల్‌లో ఈ వారం జరిగిన ప్రధాన సంఘటనలు, కరెంట్ ఈవెంట్స్ ఏవో తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ (UPSC) నుంచి ఎస్‌ఎస్‌సీ (SSC) ఎగ్జామ్స్ వరకు.. ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌ సెక్షన్‌ కీలక విభాగంగా ఉంటుంది. ఏదైనా పరీక్ష రాసే అభ్యర్థికి తప్పనిసరిగా వివిధ అంశాలపై పట్టు ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఘటనల వివరాలు తెలిసి ఉండాలి. న్యూస్ 18 జీకే క్యాప్సుల్‌లో(GK Capsule) ఈ వారం జరిగిన ప్రధాన సంఘటనలు, కరెంట్ ఈవెంట్స్(Current Events) ఏవో తెలుసుకుందాం.

నీరజ్ చోప్రా ఖాతాలో మరో రికార్డు

ఒలింపిక్ బంగారు పతక విజేత, భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఖాతాలో మరో రికార్డు నమోదైంది. స్విట్జర్లాండ్‌లో జరిగిన జురిచ్ డైమండ్ లీగ్ ఫైనల్ 2022లో 88.44 మీటర్ల బెస్ట్ త్రో విసిరి ట్రోఫీ అందుకున్నాడు. దేశచరిత్రలో డైమండ్ ట్రోఫీ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా రికార్డుకెక్కాడు. డైమండ్ ట్రోఫీతో పాటు 30,000 డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకున్న నీరజ్ చోప్రా..వచ్చే ఏడాది హంగేరీలోని బుదాపెస్ట్‌లో జరిగే 2023 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.

Jobs In Post Payment Bank: పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో ఉద్యోగాలు .. జీతం రూ. లక్షల్లో..

క్వీన్ ఎలిజబెత్ II కన్నుమూత

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II సెప్టెంబర్ 8న స్కాట్‌లాండ్‌లో కన్నుమూసింది. 96 సంవత్సరాల వయసులో ఆమె చనిపోయిందని బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. క్వీన్ ఎలిజబెత్ IIను అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమెను బాల్మోరల్ ఎస్టేట్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. 1952లో బ్రిటన్ సింహాసనాన్ని క్వీన్ ఎలిజబెత్ అధిష్టించారు. 15 మంది యూకే ప్రధాన మంత్రులు ఆమె హయంలో ప్రమాణ స్వీకారం చేయగా, ఆమె 70 సంవత్సరాల సేవలకు గుర్తుగా 2022 ఫిబ్రవరిలో ప్లాటినం జూబ్లీ నిర్వహించారు.

బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్

బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్ సెప్టెంబర్ 6న ఎన్నికయ్యారు. అంతకు ముందు విదేశాంగ మంత్రిగా ఉన్న లిజ్ ట్రస్ భారత సంతతికి చెందిన రిషి సునాక్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామాతో కన్జర్వేటివ్ పార్టీలో ప్రధాని ఎంపిక అనివార్యమైంది. అలా పోటీలో అనేక మంది పాల్గొన్నారు. రిషి సునాక్, లిజ్ ట్రస్ బరిలో నిలవగా, హోరాహోరీగా ప్రచారం సాగింది. చివరికి విజయం లిజ్ ట్రస్ నే వరించింది. లిజ్ ట్రస్‌కు 81,326 ఓట్లు రాగా, రిషి సునాక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి.

Telangana Jobs: అభ్యర్థుల ఆందోళనతో.. తెలంగాణలో మరో రిక్రూట్ మెంట్ రద్దు..

బెంగళూరు వరదలు

కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షపాతం నమోదైంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. బెంగళూరు సిటీలో గత వారంలో 251.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. గత ఆదివారం సిటీలో 131.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, 34 ఏళ్ల తర్వాత సెప్టెంబర్‌లో అంతటి వర్షపాతం నమోదు కావడం గమనార్హం. దీంతో రైతులకు తీవ్రమైన పంట నష్టం జరిగింది. కర్ణాటకలోని రోడ్లు, బ్రిడ్జిలు డ్యామేజ్ అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి.

యూఎస్ ఓపెన్ 2022 చాంపియన్‌గా స్వైటెక్

యూస్ ఓపెన్ 2022 ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరిగింది. ఇందులో చాంపియన్‌గా ఇగా స్వైటెక్ అవతరించింది. ప్రపంచంలోనే నెం.1 క్రీడికారిణిగా స్వైటెక్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ట్యూనీషియా క్రీడాకారిణి జాబెర్‌తో ఆడి ఆమెను చిత్తు చేసి ..యూఎస్ ఓపెన్ గెలిచిన తొలి పోలాండ్ క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.

IGNOU July 2022 Admission: మరోసారి రిజిస్ట్రేషన్ గడువు పొడిగించిన ఇగ్నో.. చివరి తేదీ ఎప్పుడంటే..

దేశంలో కొవిడ్ కేసుల పరిస్థితి ఇది..

దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 5221 కోవిడ్ కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 44,505,801కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,165కు చేరుకుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, General knowledge, GK Capsule, JOBS

ఉత్తమ కథలు