Home /News /jobs /

GETTING A BANK JOB IS NOT THAT DIFFICULT IF YOU FOLLOW THE TIPS MENTIONED BELOW IN IBPS REASONING SECTION TPT VB

IBPS Reasoning Tips: ఐబీపీఎస్ రీజనింగ్ ప్రిపరేషన్.. ఈ టిప్స్ పాటిస్తే బ్యాంక్ జాబ్ మీ జేబులో ఉన్నట్లే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

రీజనింగ్ ను ఎంతబాగా సాధన చేస్తే అంతబాగా స్క్రోరింగ్ చేసే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా సీటింగ్ ఆరెంజిమెంట్స్., పజ్జిల్స్ చదువుకుంటే రీజనింగ్ వచ్చేసినట్లే. వీటితో 80 శాతం రీజనింగ్ లో మీరు మార్కులు సంపాదించవచ్చు.

    (GT Hemantha Kumar, News 18, Tirupati) 

    రీజనింగ్ ను ఎంతబాగా సాధన చేస్తే అంతబాగా స్క్రోరింగ్(Scoring) చేసే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా సీటింగ్ ఆరెంజిమెంట్స్., పజ్జిల్స్ చదువుకుంటే రీజనింగ్ వచ్చేసినట్లే. వీటితో 80 శాతం రీజనింగ్(Reasoning) లో మీరు మార్కులు సంపాదించవచ్చు.ఇక ఇనిక్వాలిటిస్ ని తరావుగా నేర్చుకోవాలి.  శిలాజిజమ్స్., ఆల్ఫా న్యూమరిక్ సిరీస్., బ్లడ్ రిలేషన్స్(Blood Relations) అనే టాపిక్స్ ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి స్కోరింగ్ వచ్చే అవకాశం ఉందని తిరుపతి ఎమరాల్డ్స్ కాలేజ్ ఆప్టిట్యూడ్ ఫాకల్టీ శ్రీనివాస్ అభ్యర్థులకు సూచించారు. వారు ఇచ్చని సలహాలు, సూచనలు ఇక్కడ తెలుసుకుందాం. ఇనిక్వాలిటీస్(Inequalities) ప్రశ్న చూసిన వెంటనే బదులు రాసేలా ప్రిపేర్ అవ్వాలి. మనం ఇనిక్వాలిటీస్ ని నేర్చుకోవాలంటే వివిధ రకాల సాధనాలు ఉన్నాయి. మనం ఎంచుకొనే మార్గం ద్వారానే సులభంగా సాల్వ్ చేసేధై ఉండాలి.

    IBPS Reasoning Tips: బ్యాంక్ పరీక్షలో స్కోరింగ్ టాపిక్ ‘రీజనింగ్’.. తక్కువ సమయంలో ఎలా చేయాలో తెలుసుకోండి..


    నంబర్ సిరీస్ రెండు విధాలుగా ఉంటాయి. కొన్ని  నంబర్లు ఇచ్చి దానికి క్వశన్ మార్క్ (?) ఇవ్వడం జరుగుతుంది. ఈ సీక్వెన్స్ లో ఆరవ నుంబర్ ఏమి వస్తుందని అడుగుతారు. లేదా ఆరు నెంబర్ లు ఇచ్చి రెండవ నెంబర్ వద్దే క్వశన్ మార్క్(?) ఇచ్చే అవకాశం ఉంది. పూర్తి నంబర్ సిరీస్ ఇచ్చేసి అందులో రాంగ్ నెంబర్ ఏంటని అడుగుతారు. రాంగ్ నంబర్ ను ఐడెంటిఫై చేయాలి..., మిస్సింగ్ నుంబర్ ను కనుకోవాలి. ఈ నంబర్ సిరీస్ ను స్క్వయర్ నంబర్., క్యూబ్ నంబెర్స్., ప్రైమ్ నంబర్స్ మీద గ్రిప్ పెంచుకోవాలి.



    నెంబర్ సిరీస్ లోనే లేటర్ సిరీస్ ఉంటుంది. ఇది కూడా నెంబర్ సిరీస్ ను పోలి ఉంటుంది. అన్ని లేటర్ లకు నంబరింగ్ వేసుకోవాలి.... కన్సోనెంట్స్., ఓవెల్స్ ఏంటో తెలుసుకొవాలి. ఇలా ఈజీ మెథడ్ లో మనం నంబర్ సిరీస్ నేర్చుకోవచ్చు. ఇక వీటిని నేర్చుకుంటే అనాలజీ చాలా ఈజీగా ఉంటుంది. శిలాజిజమ్స్ నేర్చుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి వెన్ డైయాగ్రమ్ ద్వారా చేయవచ్చు. రెండవది వివిధ రకాల ఫార్ములా ద్వారా చేయవచ్చు. రెండు మెథడ్ లోను సమాధానాలు త్వరగా సాల్వ్ చేయవచ్చు. అయితే పరీక్షా సమయంలో ఫార్ములాస్ గుర్తు రాకపోవచ్చు.

    SA Preparation Tips: ఉపాధ్యాయ కొలువు సాధించాలంటే.. ఈ పుస్తకాలను చదివేయండి.. కొలువు పక్కా..!


    అదే వెన్ డైయాగ్రమ్ అయితే మనకు గుర్తు ఉండిపోతుంది. ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి దాని పజిల్ రూపంలో ఇస్తాడు. ఇందులో మూడు ప్రశ్నలు ఉంటాయి. వీటిని చదువుతున్న సమయంలోనే సమాధానం పసిగట్టాలి. ఒక సెంటన్స్ ఇస్తారు...ఒక్కో వర్డ్ కి ఒక్కో కోడింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలా నాలుగు పదాలు ఇస్తారు. అందులో కామన్ గా ఉన్న పదాల ఆధారంగా కోడింగ్ డీకోడింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని.. సమాధానలు గుర్తిస్తే.. బ్యాంక్ జాబ్ మీ జేబులో ఉన్నట్లే.
    Published by:Veera Babu
    First published:

    Tags: Career and Courses, IBPS, Ibps clerks, Ibps rrb, JOBS, Preparation

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు