Home /News /jobs /

GET READY FOR TWO YOUNG WARRIORS FEATURING THIS WEEK ON BYJUS YOUNG GENIUS SEASON 2 SRD

#BYJUSYoungGenius2లో ఈ వారం మీ ముందుకు ఇద్దరు యువవీరులు వస్తున్నారు (Advertisement)

BYJUS Young Genius Season 2

BYJUS Young Genius Season 2

#BYJUSYoungGenius2 లేటెస్ట్ ఎపిసోడ్‌లో విభిన్నమైన రంగాల్లో, సరిసమానమైన ప్రతిభను కనబరచిన ఇద్దరు యోధుల స్ఫూర్తిదాయకమైన కథనాలను చూడండి, పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి!

  ఎప్పుడైతే యువ మేధావులు తమకు నచ్చిన దానిపై సాధన చేయాలని, తమ మనస్సుకు నచ్చిన దానినే అనుసరించాలని ఒక బలమైన కోరికను కలిగిఉంటారో, అప్పుడు ఎంచుకున్న దిశగా వారు శ్రమించడం, అందులో నెమ్మదిగా రాణించడం చూస్తూ ఉంటే మన మనస్సుకు నిజమైన సంతోషం కలుగుతుంది. BYJUS Young Genius లేటెస్ట్ ఎపిసోడ్ సరిగ్గా ఇలాంటి అసాధారణమైన బాలమేధావులను మీ ముందుకు తీసుకువచ్చింది, ఒకరు ప్రాచీన భారతీయ యుద్ధ కళలో తనదైన ముద్ర వేయాలని నిర్ణయించుకోగా, మరొకరు ఈ గ్రహాన్ని ప్రతి ఒక్కరికీ పచ్చని ప్రదేశంగా మార్చడానికి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.

  ఈ వారం #BYJUSYoungGeniusSeason2లో ప్రసారం చేయబడిన ఈ మేధావుల ప్రతిభను గురించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి


  కళరిపయట్టు ధీరుడు నీలకందన్ నాయర్‌ పరిచయం –

  10 ఏళ్ల నీలకందన్ నాయర్‌కు కళరిపయట్టు అనేది కేవలం ఒక మార్షల్ ఆర్ట్ మాత్రమే కాదు, అతని జీవన విధానం కూడా. నాయర్ తన ఆరు సంవత్సరాల వయస్సు నుండి ఈ ప్రాచీన విద్యను నేర్చుకుంటున్నాడు, అతని సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఎన్నో అవార్డులను అందుకున్నారు.

  నాయర్ 2020 డిసెంబర్‌లో, కేవలం 30 నిమిషాల్లో ప్రదర్శించిన (422 బ్యాక్‌వర్డ్ వాక్‌ఓవర్లు) గరిష్ట బ్యాక్‌వర్డ్ వాక్‌ఓవర్ల సంఖ్యతో ప్రస్తుతం అరేబియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకొని అగ్రస్థానంలో నిలిచాడు. అతను శ్రీ అథర్బప్పు గురక్కల్ సమరక్కలాం సవిట్టు సంప్రదాయం 2020 పోటీలో నిర్వహించిన, వాడికరక్కల్ సబ్ జూనియర్ బాలుర స్థాయిలో 1వ స్థానాన్ని కూడా సంపాదించాడు.

  నాయర్ ప్రస్తుతం కేరళ, ఆలప్పుళలోని ఒక అకాడమీలో కళరి నేర్చుకుంటున్నాడు. కాగా, ఇప్పటికే విద్యుత్ జమ్వాల్, ఆనంద్ మహీంద్రా మరియు బాబా రామ్‌దేవ్ వంటి అనేక మంది అభిమానుల మనస్సును గెలుచుకున్నాడు. ఈ ఎపిసోడ్‌లో నాయర్ తన అద్భుతమైన ప్రదర్శనతో విద్యుత్ జమ్వాల్‌ను ఆకట్టుకున్నాడు, బదులుగా విద్యుత్, నాయర్ ప్రతిభను మరింత పెంపొందించుకోవడంలో సహాయం చేసేందుకు అతనికి, అతని కుటుంబానికి మద్దతుతుగా ఐదు లక్షలను బహుమతిగా ఇచ్చారు. ఈ బాల మేధావి కర్ర, కత్తి, డాలు వంటి ఆయుధాలతో ప్రదర్శన చేయడంలో ఇప్పటికే ప్రావీణ్యం సంపాదించినప్పటికీ, ప్రస్తుతం త్రిశూలం వాడేందుకు శిక్షణ తీసుకుంటున్నాడు. కళరిని అన్ని రకాల యుద్ధ కళలకు కన్నతల్లిగా భావించే నాయర్‌, తన కళారూపాన్ని ప్రదర్శించే తీరు మరియు దృష్టిలో నిష్ణాతుడు.

  అతని గురువు చెప్పినట్లుగా, ఈ యువ వీరుడు ఎప్పుడూ దేనికీ నిరాకరించలేదట, శిక్షణ ఎంతకష్టమైనా దానిని ఇష్టంగానే అలవరచుకునేవాడట

  పర్యావరణ యోధురాలు ప్రసిద్ధి సింగ్‌తో పాటు, ఆమె చేపట్టిన హరితహారంలో భాగస్వాములు అవ్వండి -

  తమిళనాడులోని చెంగల్పట్టుకు చెందిన తొమ్మిదేళ్ల ప్రసిద్ధి సింగ్ దేశంలోనే అత్యంత ఔత్సాహవంతులైన పర్యావరణ యోధులలో ఒకరు. ఆమె 4400 మొక్కలను నాటి, ఏకంగా ఏడు అడవులను సృష్టించినందుకు గాను, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2020 చోటు సంపాదించుకొని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అంతటితో ఆగకుండా ఒక పెద్ద లక్ష్యాన్ని చేధించడానికి ఆమె బరిలోకి దిగారు. ఇప్పటి వరకు దాదాపు 23,000 చెట్లను నాటిన సింగ్.. ఈ ఏడాది చివరి నాటికి లక్ష చెట్లను నాటాలని కంకణం కట్టుకుంది.

  చెట్లను నాటడంలో సింగ్ ఒక గొప్ప ప్రేరణకర్త, ఆమె తన తాతయ్య సహాయంతో 2020లో ప్రసిద్ధి ఎన్విరాన్‌మెంటల్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించారు. ఆమె చేసిన ఈ గొప్ప పని, ఎందరినో చెట్లను నాటడం, వ్యర్థాలను కంపోస్ట్ చేయడం, రీసైకిల్ చేయడం మరియు వేప, బూడిద, అరటి తొక్కలతో తయారు చేసిన సహజ పురుగుమందుల వాడకం వంటి ఎన్నో ఆధునిక పద్ధతులను అలవరచు కోవడంలో ప్రేరేపించింది.

  ఈ ఎపిసోడ్‌లో, సింగ్ తన G3 ప్రాజెక్టును గురించి ప్రముఖ అతిథి విద్యుత్ జమ్వాల్‌కు వివరించారు, ఇక్కడ 3Gs అనగా 'జెనరేటింగ్ ఆక్సిజన్‌', 'గ్రోయింగ్ యువర్ ఓన్ ఫుడ్' మరియు 'గివింగ్ బ్యాక్ టూ సొసైటీ' అని అర్థం. ఈ సందర్భంగా నటుడు జమ్వాల్‌ 100 చెట్లతో కూడిన అడవిని నాటుతానని వాగ్దానం చేస్తూ ప్రసిద్ధికి తనదైన మద్దతును తెలిపారు. అంతే కాదు, ఒక పర్యావరణ యోధురాలిగా ఆమె చేసిన ఈ పనిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రశంసిస్తున్న వీడియోలను చూస్తూ ఉంటే మనస్సు పులకరించిపోతుంది.

  2021లో సామాజిక సేవా విభాగంలో అందుకున్న ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ వంటి పెద్ద అవార్డులు కూడా ఈ చిన్నారి ఖాతాలో ఉన్నాయి. అంతే కాకుండా, చెన్నైకి చెందిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వారి 'బేటీ బచావో, బేటీ పఢావో' పథకం కింద ఆమె తమిళనాడు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నియమించబడిందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మరోవైపు, ఆమె పర్యావరణ సైన్యం డజను దేశాలకు పెరిగింది. ప్రస్తుతం, సహజ వృక్షజాలం, జంతుజాలం తమ స్థానిక వాతావరణంలో వృద్ధి చెందడానికి సింగ్ పండ్లు, ఫలాలు అందించే అడవులను కూడా సృష్టించింది.

  అయితే, తలపెట్టిన కార్యం ఏదైనా, అది ప్రాచీన యుద్ధ కళలో రాణించడం కావచ్చు లేదా నెలతల్లిని తిరిగి పచ్చగా మార్చడంలో అందించే సహాయమే కావచ్చు, ఈ ఇద్దరు వీరులు విభిన్న కోణాల్లో రాణిస్తుండటాన్ని చూసేందుకు నెట్‌వర్క్ 18 వారు చేపట్టిన ఈ చొరవ BYJUS Young Genius Season 2 నిజంగా ఒక స్ఫూర్తిదాయకమైన ఎపిసోడ్‌గా మారింది.

  అన్నింటికన్నా ముఖ్యంగా, ఈ యువ వీరులు తమ బాల్యంలో ఇలాంటి గొప్ప కార్యాలను చేస్తున్నపుడు, వారి తోటివారు, పెద్దలు కూడా ప్రపంచాన్ని గొప్పగా మార్చడంలో తమ వంతు కృషి చేయాల్సి ఉంది, అవునా?
  News18 నెట్‌వర్క్‌‌ వారి #BYJUSYoungGeniusSeason2లో ఈ ఎపిసోడ్‌ కోసం ట్యూన్ ఇన్ అవ్వడం మరియు చూడటం మర్చిపోవద్దు.

  (This is a Partnered Content) 
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: BYJUS, News18

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు