సెయిల్ లో(Sail) 335 పోస్టుల బర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా.. అసిస్టెంట్ మేనేజర్(Assistant Manager), ఆపరేటర్ కమ్ టెక్నీషియన్(Operation Cum Technician), మైనింగ్ మేట్(Mining Mate), ఫైర్ ఇంజర్ డ్రైవర్(Fire Engine Driver), ఎలక్ట్రికల్ టెక్నీషియన్(Electric Technician), సర్వేయర్, ఫైర్ ఆపరేటర్, ఫిట్టర్ మొదలగు పోస్టులను ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా భర్తీ చేయనున్నారు. సంబంధిత పోస్టులను అనుసరించి నెలకు జీతంగా రూ.1,29,000 నుంచి రూ.1,60,000 వరకు చెల్లిస్తారు.
- పోస్టులను బట్టి.. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
-స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
-దరఖాస్తు ఫీజు రూ.700 చెల్లించి.. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
-దరఖాస్తులకు చివరి తేదీగా సెప్టెంబర్ 30గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వివరాలకు వెబ్ సైట్ sailcareer.comను సందర్శించి తెలుసుకోవచ్చు.
ఎయిమ్స్ లో ఇన్ స్ట్రక్టర్లు..
-రిషికేశ్ కు చెందిన ఆల్ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కింద పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
-క్లినిక్ ఇన్ స్ట్రక్టర్ (నర్సింగ్), ట్యూటర్ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.
-బీఎస్సీ నర్సింగ్ లో డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి.
-రూ.2000 అప్లికేషన్ ఫీజు చెల్లించి ఆన్ లైన్ విధానంలో అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలకు http://aiimsrishikesh.edu.in/
టీసీఐఎల్ లో జనరల్ మేనేజర్ పోస్టులు
న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న టీసీఐఎల్ లో 5 జనరల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్ , డిప్యూటీ జనరల్ మేనేజర్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
-బీఈ లేదా బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఐటీ, కంప్యూటర్ సైన్స్ లో ఉత్తీర్ణత సాధించాలి.
-దరఖాస్తుల ప్రక్రియ ఆన్ లైన్ విధానంలో ఉంటుంది. సెప్టెంబర్ 30లోపు దరఖాస్తులను సమర్పించాలి. పూర్తి వివరాలకు www.tcil.net.in/index.phpద్వారా తెలుసుకోవచ్చు.
నేషనల్ పెన్షన్ స్కీం ట్రస్ట్ లో మేనేజర్ ఉద్యోగాలు..
-నేషనల్ పెన్షన్ ట్రస్ట్ కింద ఎన్పీఎస్టీలో మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో గ్రేడ్ బీ మేనేజర్లు రెండు, గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్లు 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
-పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పీజీ కలిగి ఉండాలి.
-రూ.1000 దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్లు పంపించాలి. దీనికి రెండు ఫేజ్ ల ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను సెప్టెంబర్ 20 లోపు పంపించాలి.
-పూర్తి వివరాలకు www.npstrust.org.in/ద్వారా తెలుసుకోండి.
ముంబయి పోర్ట్ లో అప్రెంటీస్ లు
-ముంబయ్ పోర్ట్ ట్రస్ట్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేశారు. దీని ద్వారా వొకేషనల్ అప్రెంటీస్ షిప్ గా నియమించనున్నారు.
-ల్యాబొరేటరీ, టెక్నీషియన్, ఎక్స్ రే టెక్నీషియన్(X Ray Technician), ఫార్మాస్యూటికల్ సైన్స్ టెక్నీషియన్(Science Technician) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
-ఇంటర్ అర్హతతో పాటు.. డిప్లొమా ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-దరఖాస్తులకు చివరి తేదీగా సెప్టెంబర్ 16గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు www.mumbaiport.gov.in/సందర్శించి తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Central Government Jobs, Central jobs, JOBS