హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Google Scholarship: విద్యార్థినులకు రూ.74,000 స్కాలర్‌షిప్ ప్రకటించిన గూగుల్... అప్లై చేయండి ఇలా

Google Scholarship: విద్యార్థినులకు రూ.74,000 స్కాలర్‌షిప్ ప్రకటించిన గూగుల్... అప్లై చేయండి ఇలా

Google Scholarship: విద్యార్థినులకు రూ.74,000 స్కాలర్‌షిప్ ప్రకటించిన గూగుల్... అప్లై చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Google Scholarship: విద్యార్థినులకు రూ.74,000 స్కాలర్‌షిప్ ప్రకటించిన గూగుల్... అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Generation Google Scholarship | స్కాలర్‌షిప్ కోరుకునే విద్యార్థినులకు గుడ్ న్యూస్. అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం అయిన గూగుల్ రూ.74,000 స్కాలర్‌షిప్ (Google Scholarship) అందిస్తోంది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

  పరిచయం అక్కర్లేని సెర్చ్ ఇంజిన్, ఇంటర్నెట్ సేవల దిగ్గజ కంపెనీ అయిన గూగుల్ (Google) విద్యార్థినులకు స్కాలర్‌షిప్ ప్రకటించింది. 'జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్' (Generation Google Scholarship) పేరుతో ఆర్థిక సహకారాన్ని ప్రకటించింది. కంప్యూటర్ సైన్స్‌లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేయాలి. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థినులు 2021 డిసెంబర్ 10 లోగా అప్లై చేయాలి. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైనవారికి 2022-23 విద్యాసంవత్సరానికి 1000 డాలర్లు అంటే సుమారు రూ.74,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.

  Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 115 ఉద్యోగాలు... రూ.1,00,000 వరకు వేతనం

  Generation Google Scholarship: ఎవరు దరఖాస్తు చేయొచ్చు


  స్కాలర్‌షిప్‌ను కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ లేదా సంబంధిత టెక్నికల్ ఫీల్డ్‌లో డిగ్రీ చదువుతున్న విద్యార్థినులకు మాత్రమే ప్రకటించింది గూగుల్. దరఖాస్తుదారులు నాయకత్వాన్ని ప్రదర్శించడంతో పాటు కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీలో ప్రాతినిధ్యం లేని బృందాలను మెరుగుపర్చేందుతు తమ అభిరుచిని, ఆసక్తిని ప్రదర్శించాలి. 2021-2022 విద్యాసంవత్సరంలో ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్నవారు మాత్రమే అప్లై చేయాలి. ఆసక్తి గల విద్యార్థినులు buildyourfuture.withgoogle.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

  ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన మరిన్ని వివరాలతో పాటు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  Post Office Jobs: పోస్ట్ ఆఫీసుల్లో 257 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  Generation Google Scholarship: దరఖాస్తు విధానం


  Step 1- ఆసక్తి గల విద్యార్థినులు buildyourfuture.withgoogle.com వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  Step 2- Scholarships+ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.

  Step 3- Generation Google Scholarship (Asia Pacific) ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.

  Step 4- నియమనిబంధనలు చదివిన తర్వాత APPLY NOW పైన క్లిక్ చేయాలి.

  Step 5- తర్వాత గూగుల్ అకౌంట్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

  Step 6- పేరు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

  Step 7- ఆ తర్వాత విద్యార్థినికి సంబంధించిన మరిన్ని వివరాలు, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేయాలి.

  Step 8- తర్వాతి సెక్షన్‌లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.

  Step 9- రెజ్యూమె, అకడమిక్ ట్రాన్స్‌స్క్రిప్ట్స్, ఎస్సే ప్రశ్నలకు సమాధానాలు అప్‌లోడ్ చేయాలి.

  Andhra Pradesh Jobs: రూ.53,500 వేతనంతో ఆంధ్రప్రదేశ్‌లో 896 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  Generation Google Scholarship: ఎంపిక విధానం


  దరఖాస్తుల్ని 2021 డిసెంబర్ 10 లోగా సబ్మిట్ చేయాలి. అప్లికేషన్స్ విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ నుంచి మెయిల్ వస్తుంది. దరఖాస్తుల్ని పరిశీలించిన తర్వాత స్కాలర్‌షిప్‌కు కొందర్ని ఎంపిక చేస్తుంది గూగుల్. వైవిధ్యం, సమానత్వం, విద్యాభ్యాసంలో పనితీరు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ స్కాలర్‌షిప్ ఇస్తామని గూగుల్ ప్రకటించింది. వారికి 1,000 డాలర్ల స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే విద్యార్థినులు generationgoogle-apac@google.com మెయిల్ ఐడీలో సంప్రదించొచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Career and Courses, Google, Scholarship, Scholarships

  ఉత్తమ కథలు