హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

General Knowledge: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా.. అయితే ఈ ప్రశ్నలకు జవాబులు గుర్తించండి..

General Knowledge: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా.. అయితే ఈ ప్రశ్నలకు జవాబులు గుర్తించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూ రౌండ్‌లో చాలాసార్లు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు కూడా అడుగుతారు. అభ్యర్థులు తికమక పెట్టే విషయాలపై ఈ ప్రశ్నలు ఆధారపడి ఉంటాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూ రౌండ్‌లో చాలాసార్లు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు కూడా అడుగుతారు. అభ్యర్థులు తికమక పెట్టే విషయాలపై ఈ ప్రశ్నలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి పోటీ అభ్యర్థులందరికీ జనరల్ నాలెడ్జ్(General Knowledge) పై మంచి పట్టు ఉండాలి. కేవలం ప్రైవేట్ ఉద్యోగాల్లో నిర్వహించే ఇంటర్వ్యూ ప్రశ్నలకే కాకుండా.. తెలంగాణలో జరగబోయే పోటీపరీక్షలకు కూడా ఈ ప్రశ్నలు ఎంతగానో ఉపయోగపడుతాయి. నిన్న జరిగిన సింగరేణి పరీక్షలో కూడా చాలా వరకు కరెంట్ అఫైర్స్ బేస్(Current Affairs Basis) చేసుకొని.. ప్రశ్నలను అడగటం జరిగింది. ఆక్టోబర్ 16 న నిర్వహించే గ్రూప్ 1 పరీక్షల్లో ఎక్కువ వెయిటేజ్ ఈ కరెంట్ అఫైర్స్ తో(Current Affairs) కూడిన జనరల్ నాలడ్జ్ కే ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ జనరల్ నాలెడ్జ్‌పై బాగా దృష్టి పెట్టాలి. GK యొక్క కొన్ని ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన ప్రశ్నలు, వాటి సమాధానాలను ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం.

Government Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 5043 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. వివరాలిలా..


ప్రశ్న- భారతదేశంలో మొదటి వాణిజ్య విమానం ఎప్పుడు మరియు ఎక్కడ బయలుదేరింది.?

జవాబు – ఫిబ్రవరి 18, 1911న భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య విమానాన్ని అలహాబాద్ నుండి నైనికి తీసుకెళ్లారు.

ప్రశ్న- భారతదేశంలో గవర్నర్ జనరల్ పాలన ఎప్పుడు ముగిసింది..?

సమాధానం - 26 జనవరి 1950

ప్రశ్న- భారతదేశంలో మొదటి జాతీయ జెండాను ఎక్కడ ఎగురవేశారు?

సమాధానం - ఉత్తర కోల్‌కత్తా

ప్రశ్న- IRCTC పూర్తి రూపం ఏమిటి?

సమాధానం - నార్త్-ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్

ప్రశ్న: రంగు సబ్బు నుండి తెల్లటి నురుగు ఎందుకు వస్తుంది?

సమాధానం - కాంతి ప్రతిబింబం

ప్రశ్న- ప్రతి సంవత్సరం "అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం" ఎప్పుడు జరుపుకుంటారు?

సమాధానం - మే 22 న

ప్రశ్న- ఏ గ్రహంలో ఎక్కువ చంద్రులు(ఉపగ్రహాలు) ఉన్నాయి.

సమాధానం- బృహస్పతి గ్రహంలో అత్యధికంగా 79 ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో 53 ఉపగ్రహాలకు మాత్రమే పేర్లు పెట్టారు. భూమికి ఒకే ఒక్క ఉపగ్రహం చంద్రుడు ఉన్నాడు.

Tenth Class Fail Jobs: 10వ తరగతి ఫెయిల్ అయినా.. ఉద్యోగం సాధించవచ్చు.. ఏ రంగంలో అంటే..


ప్రశ్న- భారతదేశపు 'గ్రాండ్ ఓల్డ్ మ్యాన్' అని ఎవరిని పిలుస్తారు?

జవాబు- దాదాభాయ్ నౌరోజీ.

ప్రశ్న- భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవి ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడింది?

జవాబు: అమెరికా

ప్రశ్న: పేపర్ కరెన్సీని విడుదల చేసిన మొదటి దేశం ఏది?

జవాబు: చైనా

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, General knowledge, JOBS

ఉత్తమ కథలు