• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • GENERAL INSURANCE CORPORATION OF INDIA GIC RECRUITMENT NOTIFICATION FOR ASSISTANT MANAGER SCALE 1 OFFICER POSTS KNOW DETAILS SS

Jobs: జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Jobs: జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

GIC Recruitment 2019 | నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను www.gicofindia.in వెబ్‌సైట్‌లో కెరీర్ సెక్షన్‌లో చూడొచ్చు.

  • Share this:
    నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్-1) పోస్టుల్ని భర్తీ చేస్తోంది జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-GIC. భారతదేశం, విదేశాల్లో ఉన్న జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫీసుల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వేర్వేరు విభాగాల్లో మొత్తం 25 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 11 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను www.gicofindia.in వెబ్‌సైట్‌లో కెరీర్ సెక్షన్‌లో చూడొచ్చు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    GIC Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


    దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 21
    దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 11
    ఆన్‌లైన్ ఎగ్జామ్ నిర్వహించే తేదీ: 2019 అక్టోబర్ 5
    ప్రీ-రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్: 2019 సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 26
    అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్-1) ఖాళీలు: 25
    ఫైనాన్స్ / అకౌంట్స్- 9
    ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సాఫ్ట్‌వేర్)- 2
    లీగల్- 6
    ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 1
    సివిల్ ఇంజనీరింగ్- 1
    ఏరోనాటికల్ ఇంజనీరింగ్- 2
    మెరైన్ ఇంజనీరింగ్- 1
    కంపెనీ సెక్రెటరీ- 2
    హిందీ- 1
    వేతనం: నెలకు రూ.32,795+అలవెన్సులు
    విద్యార్హత: ఇంజనీరింగ్, ఫైనాన్స్, కామర్స్, లా, ఐటీ లాంటి విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవాళ్లు అర్హులు. జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 60% మార్కులతో, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55% మార్కులతో పాస్ కావాలి.
    వయస్సు: 21 నుంచి 30 ఏళ్లు

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    అదిరిపోయే ఫీచర్లతో రిలీజైన వివో జెడ్1ఎక్స్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Jobs: ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 8000 పైగా టీచర్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

    TSCAB Jobs: తెలంగాణ కోఆపరేటీవ్ బ్యాంక్‌లో 62 ఉద్యోగాలు... డిగ్రీ పాసైతే చాలు

    RRB Jobs: ఆర్ఆర్‌బీ పరీక్షల షెడ్యూల్ విడుదల... ఎగ్జామ్ డేట్స్ ఇవే...
    Published by:Santhosh Kumar S
    First published: