Job Creation: నిరుద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్... రూ.35,000 కోట్లతో మోదీ సర్కార్ జాబ్స్ స్కీమ్

Job Creation | దసరా లోగా నిరుద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. రూ.35,000 కోట్లతో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కసరత్తు చేస్తోంది.

news18-telugu
Updated: September 25, 2020, 10:33 PM IST
Job Creation: నిరుద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్... రూ.35,000 కోట్లతో మోదీ సర్కార్ జాబ్స్ స్కీమ్
Job Creation: నిరుద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్... రూ.35,000 కోట్లతో మోదీ సర్కార్ జాబ్స్ స్కీమ్ (image: ప్రధాని మోదీ ఫైల్ ఫోటో)
  • Share this:
నిరుద్యోగులకు మోదీ ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. మరో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి ఉద్యోగాల కల్పనపైనే ప్రధానంగా దృష్టి పెట్టనుంది. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతదేశ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ప్యాకేజీని రూపొందించనుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, డిమాండ్ పెంచడం లాంటి వాటిపై దృష్టి పెట్టనుంది ప్రభుత్వం. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి భారతదేశ జీడీపీ 23.9 శాతం పడిపోయిన సంగతి తెలిసిందే. జీ-20 దేశాలన్నింటిలో ఇదే అత్యంత దారుణమైన పతనం. దీంతో ఖర్చు పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

BEL Jobs 2020: హైదరాబాద్, వైజాగ్‌లోని బీఈఎల్‌లో ఉద్యోగాలు...  దరఖాస్తులకు 2 రోజులే గడువు

DRDO Jobs 2020: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... డిప్లొమా, బీటెక్ అర్హత

ఇప్పటికే పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా అనేక వర్గాలకు చేయూతనందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు ప్యాకేజీలతో పోలిస్తే ఈసారి ప్రత్యక్షంగా ఆర్థిక వ్యయం జరిగేలా ఉద్దీపన చర్యలు తీసుకోనుంది. అందులో భాగంగా అర్బన్ జాబ్స్ స్కీమ్ పథకానికి రూ.35,000 కోట్లు ఖర్చు చేయనుందని అంచనా. మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ ఏడాదిలోనే పూర్తి చేసేలా 20 నుంచి 25 భారీ ప్రాజెక్టుల్ని చేపట్టనుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు, రైతులకు పథకాలు, ఉచిత ఆహార పథకం, నగదు బదిలీ లాంటివి జరుగుతాయని మనీకంట్రోల్ కథనం పబ్లిష్ చేసింది. కొత్తగా ప్రకటించబోయే ఉద్దీపన ప్యాకేజీలో ముఖ్యంగా ఉద్యోగాల కల్పనపైనే దృష్టి పెట్టనుంది కేంద్రం. ఇది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాగానే ఉంటుంది.

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 86 జాబ్స్... డిగ్రీ పాసైనవారికి అవకాశం

Indian Navy Jobs 2020: ఇంటర్ పాసైనవారికి ఇండియన్ నేవీలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

మరో ఉద్దీపన ప్యాకేజీకి సంబంధించిన డ్రాఫ్ట్ కేబినెట్ నోట్ సిద్ధమవుతోంది. దసరా, దీపావళి లాంటి పండుగలను దృష్టిలో పెట్టుకొని ఈ వరాలు ప్రకటించనుంది కేంద్ర ప్రభుత్వం. అదే జరిగితే ఇప్పటికే ఉపాధి, ఉద్యోగావకాశాలు కోల్పోయినవారికి ఊరట లభిస్తుంది.
Published by: Santhosh Kumar S
First published: September 25, 2020, 10:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading