GATE 2022 Result - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) ఖరగ్‌పూర్.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2022) ఫలితాలను మార్చ్ 17, 2022న విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గేట్ పరీక్షలో అర్హతతో దరఖాస్తు చేసుకొనే ఉద్యోగాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
NPCILలో ఉద్యోగాలు..
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 91 ట్రేడ్ అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
NMDCలో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ మైనింగ్ డవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
ఎగ్జిగ్యూటివ్ ట్రైనీ విభాగంలో 29 ఖాళీలు ఉన్నాయి. గేట్ 2021 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన వారికి ఏడాది పాటు ప్రొహిబిషన్ పిరియడ్ ఉంటుంది. ట్రైనీలకు నెలకు రూ. 50 వేల వేతనం ఉంటుంది. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Engineering, Govt Jobs 2022, IIT, Job notification, JOBS