గేట్ (GATE)-2023 రిజిస్ట్రేషన్స్ ప్రారంభించినట్లు వెల్లడించింది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్ (IIT Kanpur). అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ Gate.iitk.ac.in ద్వారా అప్లై చేసుకోవాలని సూచించింది. అప్లికేషన్ (Application) ఫారమ్ సమర్పించడానికి చివరి తేదీ 2022 సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. కాగా, గేట్- 2023 ఎగ్జామ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు.
* గేట్-2023 పరీక్షా విధానం
గేట్-2023 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT). ఈసారి ఐఐటీ కాన్పూర్ ఈ పరీక్షలు నిర్వహించనుంది.
* గేట్-2023: పూర్తి షెడ్యూల్
ఆన్‌లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ: 2022 ఆగస్టు 30
రెగ్యులర్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 2022 సెప్టెంబర్ 30
పొడిగించిన రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ (ఆలస్య రుసుముతో): 2022 అక్టోబర్ 07
గేట్ అడ్మిట్ కార్డ్‌ల రిలీజ్: 2023 జనవరి 3
గేట్ పరీక్ష తేదీలు: 2023 ఫిబ్రవరి 4, 5, 11 & 12
అప్లికేషన్ పోర్టల్‌లో అభ్యర్థి రెస్పాన్స్ విండో: 2023 ఫిబ్రవరి 15
ఆన్సర్ కీ ప్రకటన: 2023 ఫిబ్రవరి 21
ఆనర్స్ కీపై అభ్యంతరాల కోసం: 2023, ఫిబ్రవరి 22- 25 వరకు.
గేట్-2023 ఫలితాల ప్రకటన: 2023 మార్చి 16
స్కోర్ కార్డ్ రిలీజ్ తేదీ: 2023 మార్చి 21
* గేట్-2023: అప్లికేషన్ ప్రాసెస్
స్టెప్-1:ఐఐటీ కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్- gate.iitk.ac.inను సందర్శించాలి.
స్టెప్-2:హోమ్ పేజీలో గేట్-2023 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
స్టెప్-3:అభ్యర్థులు తమ వివరాలతో పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలి.
స్టెప్-4: ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వండి.
స్టెప్-5: గేట్-2023 అప్లికేషన్ నింపండి.
స్టెప్-6:అవసరమైన స్కాన్ చేసిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
స్టెప్-7: అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తును సబ్‌మిట్ చేయండి
స్టెప్-8: భవిష్యత్తు అవసరాల కోసం గేట్-2023 అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
* గేట్-2023: పేపర్లు
గేట్ పరీక్ష 29 సబ్జెక్టులపై జరగనుంది. ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/సైన్స్/కామర్స్/ఆర్ట్స్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్ చేయడానికి, అలాగే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల మద్దతు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లలో ఆర్ట్స్, సైన్స్ డిపార్ట్‌మెంట్‌లలో డాక్టోరల్ ప్రోగ్రామ్స్ చేయాలంటే వ్యాలిడ్ గేట్ స్కోర్ తప్పనిసరి.
* గేట్-2023 అర్హత ప్రమాణాలు
ప్రస్తుతం ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు లేదా ఇంజినీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/సైన్స్/కామర్స్/ఆర్ట్స్‌లో ఇప్పటికే డిగ్రీ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన అభ్యర్థులు గేట్- 2023కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఇది కూాడా చదవండి : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ వారం అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిన జాబ్స్ ఇవే..
* టాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం
గేట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఐఐటీస్(IITs), ఐఐఎస్‌సీ (IISc) బెంగళూరు వంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు అర్హత సాధిస్తారు. గేట్ స్కోర్ ఆధారంగా విద్యార్థులు స్కాలర్‌షిప్‌లతో పాటు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల అనేక ప్రభుత్వ రంగ సంస్థలు తమ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను గేట్ స్కోర్ ఆధారంగా చేపడున్నాయి. జాతీయ స్థాయి పరీక్ష అయిన గేట్‌ను కోఆర్డినేషన్ బోర్డ్ (NCB) ఆధ్వర్యంలో IISc బెంగళూరు, మరో ఏడు ఐఐటీలు బొంబాయి, ఢిల్లీ , గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Gate 2023, JOBS