హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

GATE 2023: ఆగస్టు 30 నుంచి గేట్-2023 రిజిస్ట్రేషన్స్.. అప్లై చేసుకోవడానికి అవసరమయ్యే డాక్యుమెంట్స్‌ ఇవే..!

GATE 2023: ఆగస్టు 30 నుంచి గేట్-2023 రిజిస్ట్రేషన్స్.. అప్లై చేసుకోవడానికి అవసరమయ్యే డాక్యుమెంట్స్‌ ఇవే..!

GATE 2023

GATE 2023

GATE 2023: రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30గా నిర్ణయించారు. గేట్-2023 సిలబస్ ప్రకారం.. 29 సబ్జెక్టులపై పరీక్ష నిర్వహించనున్నారు. ఒక అభ్యర్థికి ఒకటి లేదా రెండు పేపర్ల వరకు మాత్రమే హాజరు కావడానికి అనుమతిస్తారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (Gate)- 2023 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (Online Registration) ప్రక్రియ 2022 ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న గేట్-2023 పరీక్షను ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) నిర్వహించనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ gate.iitkgp.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30గా నిర్ణయించారు. గేట్-2023 సిలబస్ ప్రకారం.. 29 సబ్జెక్టులపై పరీక్ష నిర్వహించనున్నారు. ఒక అభ్యర్థికి ఒకటి లేదా రెండు పేపర్ల వరకు మాత్రమే హాజరు కావడానికి అనుమతిస్తారు. అయితే, ముందుగా పేర్కొన్న “టూ పేపర్ కాంబినేషన్ లిస్ట్” నుంచి రెండో పేపర్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఈ లిస్ట్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో విడుదల చేయనున్నారు. కాగా, గేట్-2023 పరీక్షను ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు.


* గేట్- 2023 రిజిస్ట్రేషన్‌కు అవసరమైన డాక్యుమెంట్లు


* అభ్యర్థి ఫోటోగ్రాఫ్, సంతకం స్కాన్ చేసిన కాపీ, చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ (ఆధార్ కార్డ్/పాస్‌పోర్ట్/డ్రైవింగ్ లైసెన్స్/పాన్ కార్డ్/ఓటర్ ఐడీ/కాలేజ్ ఐడీ)


* విదేశాల నుంచి దరఖాస్తు చేసేవారు పాస్‌పోర్ట్/ ప్రభుత్వం జారీ చేసిన ఐడీ/కాలేజ్ ఐడీ/ఎంప్లాయీ ఐడీ వంటి చెల్లుబాటు అయ్యే ఐడీ ఫ్రూప్స్‌.


* డిగ్రీ/ ప్రొవిజనల్/ కోర్సు పూర్తి చేసిన సర్టిఫికెట్


* 5/6 / 7వ సెమిస్టర్ మార్క్ షీట్ ప్రింటౌట్స్* హోమ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్/డీన్/రిజిస్ట్రార్/డిపార్ట్‌మెంట్ హెడ్ షేర్ చేసిన ఫార్మాట్‌కు అనుగుణంగా చివరి సంవత్సరం విద్యార్థులు ప్రొవిజనల్ సర్టిఫికేట్ లెటర్‌ను సమర్పించాలి.


* క్యాస్ట్ సర్టిఫికేట్ (వర్తిస్తే)


* వైకల్యం లేదా PwD సర్టిఫికేట్ (వర్తిస్తే)


* ప్రస్తుతం ఉన్నత డిగ్రీ లేదా మాస్టర్స్ చదువుతున్న అభ్యర్థులు డిగ్రీ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేయాలి.


బ్యాక్‌లాగ్స్ విద్యార్థులు, వారు చదువుతున్న ఇన్‌స్టిట్యూట్ జారీ చేసిన చివరి సంవత్సరం మార్కు షీట్ కాపీని తప్పనిసరిగా సమర్పించాలి. ఫీసు చెల్లించడానికి, అభ్యర్థులు తమ డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా UPI వివరాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ చెక్ చేయాలని ఐఐటీ కాన్పూర్ సూచించింది.


* అర్హత ప్రమాణాలు
ప్రస్తుతం ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో 3వ సంవతర్సం లేదా ఆపై సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు గేట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే ఇంజినీరింగ్ / టెక్నాలజీ / ఆర్కిటెక్చర్ / సైన్సెస్ / కామర్స్ / ఆర్ట్స్‌లో ఏదైనా డిగ్రీని పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


ఇది కూడా చదవండి : ఏడాదికి రూ.15 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. ఓ రైతు కొడుకు సక్సెస్ స్టోరీ..


* టాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం

గేట్‌ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఐఐటీస్(IITs), ఐఐఎస్‌సీ (IISc) బెంగళూరు వంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు అర్హత సాధిస్తారు. గేట్ స్కోర్ ఆధారంగా విద్యార్థులు స్కాలర్‌షిప్‌లతో పాటు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్ / టెక్నాలజీ / ఆర్కిటెక్చర్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్‌ కోసం అప్లై చేసుకోవచ్చు.


ఇక ఆర్ట్స్ అండ్ సైన్స్ బ్రాంచ్‌లలో సంబంధిత డాక్టోరల్ ప్రోగ్రామ్‌లకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల అనేక ప్రభుత్వ రంగ సంస్థలు తమ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను గేట్ స్కోర్‌ ఆధారంగా చేపడున్నాయి. జాతీయ స్థాయి పరీక్ష అయిన గేట్‌ను కోఆర్డినేషన్ బోర్డ్ (NCB) ఆధ్వర్యంలో IISc బెంగళూరు, మరో ఏడు ఐఐటీలు బొంబాయి, ఢిల్లీ , గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, Gate, Gate 2023, IIT, JOBS

ఉత్తమ కథలు