దేశ వ్యాప్తంగా పీజీ, డాక్టరేట్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే గేట్-2023 (GATE-2023) నోటిఫికేషన్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. ఈ ఏడాది గేట్ ను ఐఐటీ కాన్పూర్ (Indian Institute of Technology, Kanpur) నిర్వహించనుంది. గేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ (Gate Registration) ఈ నెల 30న ప్రారంభించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గేట్ కు దరఖాస్తు (GATE Application) చేసుకోవడానికి సెప్టెంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. గేట్ ఎగ్జామ్ ను (GATE Exam Dates) వచ్చే ఏడాది ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. ఫలితాలను మార్చి 16, 2023న విడుదల చేయనున్నట్లు ఐఐటీ కాన్పూర్ తెలిపింది.
దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు:
ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, టెక్నాలజీ, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు సైతం అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు.
NEET 2022: నీట్ అభ్యర్ధులకు అలర్ట్.. ఈ రోజే ఆన్సర్ కీ రిలీజ్..! పర్సంటైల్ స్కోర్, కటాఫ్ మార్కులు ఎంతంటే..
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. మూడుగంటల పాటు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. 29 సబ్జెక్టుల్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది. 1 లేదా 2 పేపర్లను అభ్యర్థులు ఎంచుకోవచ్చు. నెగటీవ్ మార్కింగ్ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.1700 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు రూ.850 చెల్లిస్తే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు:
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 80, 2022.
రిజిస్ట్రేషన్ కు ఆఖరి తేదీ: సెప్టెంబర్ 30, 2022.
లేట్ ఫీజుతో లాస్ట్ డేట్: అక్టోబర్ 7.
పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 4, 5, 11, 12.
పరీక్ష తేదీలు: మార్చి 16.
అధికారిక వెబ్ సైట్ : https://gate.iitk.ac.in/
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.