హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

GATE 2023 Mock Test: గేట్‌ 2023 అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఐఐటీ కాన్పూర్‌ అందిస్తున్న మాక్ టెస్ట్‌ల వివరాలు ఇవే..

GATE 2023 Mock Test: గేట్‌ 2023 అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఐఐటీ కాన్పూర్‌ అందిస్తున్న మాక్ టెస్ట్‌ల వివరాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐఐటీలలో ఎంటెక్‌ కోర్సుల్లో చేరడానికి ఏటా గేట్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభచూపిన వారికి ఐఐటీ ఇన్‌స్టిట్యూట్‌లలో సీటు లభిస్తుంది. గేట్‌ క్లియర్‌ చేయడానికి విద్యార్థులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఐఐటీ కాన్పూర్‌ 2023 గేట్‌ ఎంట్రన్స్‌ నిర్వహిస్తోంది. అభ్యర్థుల కోసం కొన్ని మాక్‌టెస్ట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

చాలా మంది విద్యార్థులకు ఐఐటీ (IIT) కల ఉంటుంది. ఇంటర్‌ తర్వాత ఐఐటీలో చేరడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. మరి కొంత మంది ఇంజినీరింగ్‌ పూర్తయిన తర్వాత ఎంటెక్ కోర్సులు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఐఐటీలలో ఎంటెక్‌ కోర్సుల్లో చేరడానికి ఏటా గేట్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభచూపిన వారికి ఐఐటీ ఇన్‌స్టిట్యూట్‌లలో సీటు లభిస్తుంది. కఠినమైన గేట్‌ ఎగ్జామ్‌ క్లియర్‌ చేయడానికి విద్యార్థులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఐఐటీ కాన్పూర్‌ 2023 గేట్‌ (GATE-2023) ఎంట్రన్స్‌ నిర్వహిస్తోంది. ప్రస్తుతం అభ్యర్థుల కోసం కొన్ని మాక్‌టెస్ట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఐటీ కాన్పూర్‌ వెబ్‌సైట్‌లో మాక్‌టెస్ట్‌ లింకులు

గేట్‌ ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థుల కోసం IIT కాన్పూర్ గేట్ 2023 మాక్ టెస్ట్ లింక్‌లను అధికారిక వెబ్‌సైట్‌(gate.iitk.ac.in)లో ఉంచింది. 2023 గేట్ ఎగ్జామ్‌ రాస్తున్న అభ్యర్థులు తమను తాము మెరుగుపరచుకునేందుకు ఈ మాక్ టెస్ట్‌లు ఉపయోగపడతాయి. 2023 ఫిబ్రవరి 4 నుంచి 12 వరకు గేట్ ఎగ్జామ్ జరగనుంది. గేట్‌ ఒరిజినల్ ఎగ్జామ్ తరహాలోనే ఈ మాక్ టెస్ట్‌ను కూడా 180 నిమిషాల పాటు నిర్వహిస్తారు. క్వశ్చన్ పేపర్‌ను రెండు సెక్షన్‌లుగా విభవిస్తారు. సబ్జెక్ట్‌ రిలేటెడ్‌ ప్రశ్నలు 85, జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

ప్రతి తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. IIT కాన్పూర్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో 23 క్వశ్చన్ పేపర్లకు సంబంధించిన లింకులను ప్రొవైడ్ చేసింది. అందులో ఆరు పేపర్లు హ్యూమానిటీ అండ్ సైన్స్ బ్యాగ్రౌండ్‌ నుంచి ఉంటాయి. అభ్యర్థి రాసే మాక్ టెస్ట్ కూడా ఒరిజినల్ ఎగ్జామ్‌కి రిలేటెడ్‌గా ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్‌లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ.. మాక్ ఎగ్జామ్ రాస్తున్న ఎన్విరాన్‌మెంట్‌ ఫైనల్ ఎగ్జామ్‌కి తగినట్లు ఏర్పాటు చేసుకోవాలి.

Gate 2023: గేట్ 2023 పరీక్ష షెడ్యూల్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే..

మాక్ ఎగ్జామ్ రాయడానికి సూచనలు

మాక్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్న అభ్యర్థులు ముందుగా IIT కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి. అనంతరం హోమ్‌పేజ్‌లో ఉన్న మాక్ టెస్ట్ లింకుపై క్లిక్ చేయాలి. తర్వాత పేపర్స్‌కు సంబంధించిన లింకును క్లిక్ చేయాలి. అనంతరం లాగిన్‌ పోర్టల్‌లో లాగిన్ ఇన్ఫర్మేషన్ ఎంటర్‌ చేసి సైన్ ఇన్ అవ్వాలి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామ్ రాయడానికి అందుబాటులోకి వస్తాయి. 2023 గేట్ ఎగ్జామ్ రాసే PWDS క్యాండిడేట్స్ కొరకు IIT కాన్పూర్ కొన్ని ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. లోపంతో సంబంధం లేకుండా మినిమం 40 శాతం డిసెబిలిటీ ఉన్న అభ్యర్థుల కొరకు ల్యాబ్‌ అసిస్టెంట్, రీడర్, స్క్రైబర్‌లను ప్రొవైడ్ చేయనున్నట్లు తెలిపింది.

First published:

Tags: Career and Courses, Exam Tips, Exams, Gate 2023, JOBS

ఉత్తమ కథలు