GATE 2022 RESULT RELEASED KNOW HOW TO DOWNLOAD SCORECARD AND DETAILS EVK
GATE 2022 Result: "గేట్-2022" ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోండిలా
ప్రతీకాత్మక చిత్రం
GATE 2022 Result - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) ఖరగ్‌పూర్.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2022) ఫలితాలను మార్చ్ 17, 2022న విడుదల చేసింది.
GATE 2022 Result - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) ఖరగ్‌పూర్.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2022) ఫలితాలను మార్చ్ 17, 2022న విడుదల చేసింది. గేట్ 2022 పరీక్ష ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE-2022) పరీక్ష.. ఇంజనీరింగ్, సైన్స్‌లోని వివిధ అండర్ గ్రాడ్యుయేట్ సబ్జెక్టుల్లో పీజీ ప్రవేశాలకు ప్రతి ఏడాది నిర్వహిస్తారు. అదే విధంగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ నియామకాలను కూడా గేట్ స్కోర్ ఆధారంగా చేపడతారు. అయితే ఈ ఫలితాలకు సంబంధించిన స్కోర్‌కార్డు (Score Cards) లను మార్చి 21 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రోల్ నంబర్, పాస్వర్డ్ లేదా ఈ-మెయిల్ ఐడీతో లాగినై ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఐఐటీ ఖరగ్‌పూర్.. గేట్ ఫలితాల (GATE 2022 Results)తో పాటు ఆన్సర్ కీని కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
రిజల్ట్ చెక్ చేసుకోండిలా..
- మొదట అధికారిక వెబ్సైట్ https://gate.iitkgp.ac.in/ ను ఓపెన్ చేయాలి
- హోమ్‌పేజీలో కనిపించే GATE 2022 Result లింక్‌పై క్లిక్ చేయాలి
- వెంటనే న్యూ స్క్రీన్ ఓపెన్ అవుతుంది.
- రోల్ నంబర్, పాస్ వర్డ్‌తో రిజల్ట్ కోసం లాగిన్ అవ్వాలి.
- ఫలితాల కాపీని ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
2021లో, CE కోసంమొత్తం అత్యధిక మార్కులు 100కి 95.56. అత్యల్ప ఉత్తీర్ణత శాతం ST పేపర్లో నమోదైంది. 8.42 శాతం మంది అభ్యర్థులు గేట్-2022 అర్హత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 17.82 శాతం కాగా, వ్యక్తిగత పేపర్లో అర్హత సాధించిన అభ్యర్థుల శాతం 8.42 శాతం నుంచి 29.54 శాతం వరకు ఉంది. గత సంవత్సరం పరీక్షలోమొత్తం 98,732 మంది పురుషులు 28,081 మంది మహిళా అభ్యర్థులు అర్హత సాధించారు.
ఈ సారి కొత్తగా రెండు పేపర్లు..గేట్ 2022 మూడు గంటల కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) పరీక్ష నిర్వహించారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ ఏడాది గేట్ పరీక్షలో రెండు కొత్త సబ్జెక్ట్ పేపర్లను చేర్చారు. వీటితో కలిపి మొత్తం సబ్జెక్ట్ పేపర్ల సంఖ్య 29కి పెరిగింది. గేట్–2022లో కొత్తగా NM (నేవల్ ఆర్కిటెక్చర్ మరియు మెరైన్ ఇంజనీరింగ్), GE (జియోమాటిక్స్ ఇంజనీరింగ్) రెండు సబ్జెక్ట్ పేపర్లను చేర్చారు.
ఈ ఏడాది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్ పరీక్షలను ఫిబ్రవరి 5న మొదటి షిప్టులో, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ పరీక్షలను తర్వాత రెండో షిప్టులో నిర్వహిస్తారు. గేట్ స్కోరు మొత్తం మూడేళ్ల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.