GATE 2022: గేట్ ఎగ్జామ్ తేదీలు విడుదల..ఈసారి కొత్తగా వస్తున్న మార్పులివే..

ప్రతీకాత్మక చిత్రం

ఇంజనీరింగ్‌లో పీజీ ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పరీక్ష తేదీలను విడుదల చేశారు. గేట్-2022 పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు.

  • Share this:
ఇంజనీరింగ్‌లో పీజీ ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పరీక్ష తేదీలు వెల్లడయ్యాయి. గేట్-2022 పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సారి గేట్ పరీక్షను ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించనుంది. గేట్-2022లో కొత్తగా రెండు పేపర్లను ప్రవేశపెట్టారు. గతంలో మొత్తం 27 బ్రాంచ్​లకు పరీక్ష నిర్వహిస్తుండగా.. ఇకపై, 29 బ్రాంచ్​లకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈసారి కొత్తగా GE (జియోమాటిక్స్ ఇంజనీరింగ్), NM (నావల్ ఆర్కిటెక్చర్, మెరైన్ ఇంజనీరింగ్) 2 పేపర్లను ప్రవేశపెట్టారు. నౌకానిర్మాణ పరిశ్రమలు, జియో- ఇన్ఫర్మేటిక్స్​ రంగాల్లోని గ్రాడ్యుయేట్లకు భవిష్యత్తులో అనేక ఉద్యోగ అవకాశాలు ఉండటంతో ఈ బ్రాంచుల్లో కూడా గేట్​ ఎగ్జామ్​ నిర్వహించనున్నారు. గేట్-2020కి హాజరయ్యే అభ్యర్థులు ఐఐటి ఖరగ్​పూర్ అధికారిక వెబ్‌సైట్ www.iitkgp.ac.in ద్వారా పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
Engineering Admissions: భారీగా తగ్గిన ఇంజనీరింగ్ సీట్లు... కోర్సులను రద్దు చేస్తున్న కాలేజీలు

గేట్​ స్కోర్​ ద్వారా ఐఐటీ, ఎన్​ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్​ ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఎంఈ/ఎంటెక్​ ప్రవేశాలు పొందవచ్చు. కేవలం దేశీయ సంస్థలే కాకుండా విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా గేట్​ స్కోర్​ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. గేట్​ స్కోర్​తో బీహెచ్​ఈఎల్​, పవర్​ గ్రిడ్​, బెల్​, డీఆర్​డీఓ, గెయిల్​, హాల్, ఇండియన్​ ఆయిల్​ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. ఇవి, కేవలం గేట్​ స్కార్​ ఆధారంగా అభ్యర్థులను షార్ట్​లిస్ట్​ చేసి, వారికి ఇంటర్వూ నిర్వహించి రిక్రూట్​ చేసుకుంటున్నాయి.

కొత్తగా రెండు పేపర్లు..
గేట్​–2022కు సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన బ్రోచర్​ను ఐఐటీ ఖరగ్​పూర్​ త్వరలోనే తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చనుంది. ఈసారి కేవలం ఇంజినీరింగ్​ గ్రాడ్యుయేట్లే కాకుండా బిడిఎస్, ఎం.ఫార్మ్ అర్హత కలిగిన విద్యార్థులు కూడా ఈ​ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ ఏడాది మొత్తం 858,890 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ఐఐటి ఖరగ్‌పూర్ త్వరలో గేట్–2022 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించనుంది. ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత మోడ్ ద్వారా నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 180 నిమిషాల పాటు జరుగుతుంది. గేట్–2022 పరీక్షల కోసం దేశవ్యాప్తంగా మొత్తం 195 కేంద్రాలు అందుబాటులో ఉంటాయి.
Published by:Nikhil Kumar S
First published: