ఇంజనీరింగ్ విద్యలో పీజీ ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (Graduate Aptitude Test in Engineering)–2022 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈసారి ఐఐటీ ఖరగ్‌పూర్ గేట్ (GATE) పరీక్షను నిర్వహించనుంది. ఫిబ్రవరి 5 నుంచి 13వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు (Admit Cards) జనవరి 3న విడుదలకానున్నాయి. అభ్యర్థులు మొత్తం షెడ్యూల్‌ను, అడ్మిట్ కార్డులను ఐఐటీ ఖరగ్‌పూర్ (Kharagpur) అధికారిక వెబ్సైట్ www.gate.iitkgp.ac.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరింది. అభ్యర్థులు పరీక్ష రోజు వరకు అడ్మిట్ కార్డ్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, హాల్ టికెట్ (Hall Ticket) హార్డ్ కాపీని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలని పేర్కొంది.
కాగా, ఈ పరీక్షలను మొత్తం రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. తాజాగా విడుదల చేసిన గేట్ బ్రోచర్ ప్రకారం, ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో జరుగుతుంది.
Jobs in Andhra Pradesh: కర్నూలు జిల్లాలో 30 ఉద్యోగాలు.. అర్హతలు ఇవే!
ఈసారి బీడీఎస్, ఎంఫార్మా అభ్యర్థులకు సైతం అవకాశం..
కాగా, గేట్–2022లో కొత్తగా రెండు పేపర్లను ప్రవేశపెట్టారు. గతంలో మొత్తం 27 బ్రాంచ్‌లకు పరీక్ష నిర్వహిస్తుండగా.. ఇకపై 29 బ్రాంచ్‌లకు పరీక్ష నిర్వహిస్తారు. ఈసారి జియోమాటిక్స్ ఇంజనీరింగ్ (జీఈ), నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ (ఎన్ఎం) అనే రెండు కొత్త పేపర్లను ప్రవేశపెట్టారు. నౌకానిర్మాణ పరిశ్రమలు, జియో- ఇన్ఫర్మేటిక్స్ కోర్సులు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతో ఈ బ్రాంచుల్లో కూడా గేట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
Jobs in Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
ఈసారి కేవలం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లే కాకుండా బీడీఎస్ (BDS), ఎం.ఫార్మా అర్హత కలిగిన విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
గేట్ స్కోర్ (GATE Score) ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీలతో పాటు దేశంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల్లో ఎంఈ/ ఎంటెక్ ప్రవేశాలు పొందవచ్చు. దీనితో పాటు పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్(పీఎస్‌యూ)లు సైతం గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకొని నియామకాలు చేపడుతున్నాయి. గేట్ స్కోర్‌తో బీహెచ్ఈఎల్, పవర్ గ్రిడ్, బెల్, డీఆర్డీఓ, సెయిల్, గెయిల్, హాల్, ఇండియన్ ఆయిల్ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. పైన పేర్కొన్న ఈ సంస్థలు కేవలం గేట్ స్కార్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి.. ఇంటర్వ్యూ (Interview) నిర్వహించి ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నాయి. కేవలం దేశీయ సంస్థలే కాకుండా విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Engineering course, Exams