ఏదో ఒక ఐఐటీ కాలేజీ (IIT College)లో అడ్మిషన్ పొందేందుకు గేట్ (GATE) పరీక్షలో మంచి స్కోర్ సాధించాలని చాలామంది అభ్యర్థులకు ఒక డ్రీమ్ ఉంటుంది. అయితే గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన 23 ఏళ్ల వందిత్ పటేల్ (Vandit Patel) ఇందుకు భిన్నం. వందిత్ గేట్ 2021 (Gate 2021) ఎగ్జామ్‌లో ఐఐటీలలో అడ్మిషన్లు(Admissions) సంపాదించేందుకు సరిపడా మార్కులు(Marks) సాధించాడు. కానీ ఏ ఐఐటీ కాలేజీలోనూ చేరలేదు. ఎందుకంటే అతనికి వచ్చిన మార్కులు తన ‘డ్రీమ్ కాలేజీ (Dream College)’లో అడ్మిషన్ పొందేందుకు సరిపోలేదట. అందుకే మళ్లీ 2022లో గేట్ పరీక్ష(Gage Exam) రాసి టాప్ ర్యాంకు తెచ్చుకొని అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఈసారి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించాడు. అలా తన డ్రీమ్ కాలేజీలో చేరే కలను నెరవేర్చుబోతున్నాడు.
వందిత్ పటేల్ కంప్యూటర్ సైన్స్ మైనర్‌తో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో నిర్మా యూనివర్సిటీ నుంచి 2020లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. పటేల్ తన 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి సైంటిస్ట్ అవ్వాలని అనుకునేవాడట. తన తండ్రి డాక్టర్ ప్రకాష్ పటేల్ కూడా ఒక పరిశోధనా శాస్త్రవేత్త. అందువల్ల, గేట్ 2021 (Gate 2021)లో 842 ర్యాంక్ వచ్చినా గౌహతి, భువనేశ్వర్, ధన్‌బాద్, వారణాసిలోని ఐఐటీలలో అడ్మిషన్లకు అర్హత ఉన్నప్పటికీ వెంటనే జాయిన్ అయిపోలేదు. పటేల్ IISc బెంగళూరు లేదా ఫస్ట్ లెవల్ ఐఐటీ నుంచి ఎంటెక్ డేటా సైన్స్ చదవాలనే లక్ష్యంతో మళ్లీ గేట్ రాయాలని నిర్ణయించుకున్నాడు.
తన రెండవ ప్రయత్నంలో పటేల్ తప్పులు చెయ్యకుండా జాగ్రత్త పడ్డాడు. ఎంతటి కష్టమైన ప్రశ్ననైనా పరిష్కరించడానికి తగినంత విశ్వాసాన్ని పొందడానికి బైజూస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ టెస్ట్ సిరీస్ పూర్తి చేశాడు. ఎలక్ట్రికల్ లేదా ఈఈ పేపర్లో 100కి 91 మార్కులు లేదా 996 గేట్ స్కోర్‌తో ఆల్ ఇండియా రెండో ర్యాంక్ సంపాదించాడు. మొదటి ప్రయత్నంలో సిలబస్‌లో కనీసం 30 శాతాన్ని వదిలిపెట్టానని.. ఈసారి 100% సిలబస్‌లో ప్రిపేరయితే లక్ష్యాన్ని సాధించడంలో సులభమైన అని తనకు తెలుసు అని చెప్పాడు. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐఎస్సీ (IISC) అనే మూడు కాలేజీల్లో తప్ప ఏ కాలేజీలో కూడా చేయకూడదని తాను నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
జేఈఈ మెయిన్స్ లో కూడా వందిత్ ఉత్తీర్ణత సాధించాడు కానీ తనకు నచ్చిన కాలేజీలో చేరే మార్కులు రాలేదు. కెమిస్ట్రీ తనకు నచ్చదని అందుకే దానికి తక్కువ సమయం కేటాయించానని చెప్పాడు. కాబట్టి దానికి తక్కువ సమయం ఇచ్చాను. మెషీన్లను ఒక సబ్జెక్ట్‌గా ఇష్టపడనప్పటికీ, దానిని విభిన్న మోడ్‌లను ఉపయోగించి చదివానని, పూర్తి శ్రద్ధ పెట్టానని వందిత్ చెప్పుకొచ్చాడు. తర్వాత ఈ సబ్జెక్ట్‌గా ఆసక్తి పెరిగిందన్నాడు. ఒక సబ్జెక్ట్‌పై ఎలా పని చేస్తామనే దానిపై ఆధారపడి ఆసక్తి పెరుగుతుంది అని తను అర్థం చేసుకున్నట్లు తెలిపాడు, ఈసారి మొత్తం సిలబస్‌ను పూర్తి చేసి, గేట్ 2022 కోసం కనీసం 50 ప్రాక్టీస్ పరీక్షలు రాశానని పటేల్ చెప్పాడు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.