హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

GATE 2022: గేట్-2022 ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. అభ్యర్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వివరాలివే..

GATE 2022: గేట్-2022 ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. అభ్యర్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ్రాడ్యుయేట్​ ఆప్టిట్యూడ్ టెస్ట్​ ఇన్​ ఇంజినీరింగ్​ (GATE-2022) దరఖాస్తు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈ ఎగ్జామ్ కు సంబంధించిన అర్హతలు(GATE Eligibility), ఈ సారి కొత్తగా వచ్చిన మార్పులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రాడ్యుయేట్​ ఆప్టిట్యూడ్ టెస్ట్​ ఇన్​ ఇంజినీరింగ్​  గేట్​-2022 (GATE 2022)దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి సెప్టెంబర్​ 24 వరకు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది గేట్​ పరీక్షను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఖరగ్‌పూర్ (IIT Kharagpur) నిర్వహిస్తోంది. గేట్​ ఎగ్జామ్​ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్​ఐటీలు, వివిధ రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల్లో ఎంఈ/ఎంటెక్ అడ్మిషన్లు పొందవచ్చు. అంతేకాదు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు గేట్​ స్కోర్​ ఆధారంగా అభ్యర్థులను తమ సంస్థల్లో నియమించుకుంటున్నాయి. గేట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్(GOAPS) ద్వారా సెప్టెంబర్​ 24లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో అక్టోబర్​ 1 వరకు దరఖాస్తు ఫారం సబ్​మిట్​ చేయవచ్చు. ఈ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్​ లింక్​ను వెబ్​సైట్​ నుంచి​​ తొలగిస్తారు. గేట్​ 2022 పరీక్ష ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 13 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అయితే దేశంలో కోవిడ్​ పరిస్థితిని బట్టి ఎగ్జామ్​ తేదీని మార్చే అవకాశం ఉందని ఐఐటీ ఖరగ్​పూర్​ వెల్లడించింది.

దీనిపై ఐఐటీ ఖరగ్​పూర్​ ట్వీట్​ చేస్తూ ‘‘గేట్​ పరీక్షలో పాల్గొనే అభ్యర్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధానమైంది. ఎగ్జామ్​ తేదీ నాటికి దేశంలో కోవిడ్​–19 మహమ్మారి పరిస్థితిని బట్టి ఈ వెబ్​సైట్​లో పేర్కొన్న ఎగ్జామ్​ డేట్స్​ మారవచ్చు. లేదా పరిస్థితి తీవ్రతను బట్టి రద్దు కూడా చేసే అవకాశం ఉంది” అని తెలిపింది.

TS EAMCET 2021 Counselling: ఈ రోజు నుంచే తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్.. అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..

అర్హత

ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్/ సైన్స్/ కామర్స్/ ఆర్ట్స్‌ విభాగాల్లో ఏఐసీటీఈ, యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్, బీఆర్క్​, బీ ప్లానింగ్​​ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆయా అండర్​ గ్రాడ్యుయేట్​ కోర్సుల్లో​ మూడు, నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తుకు అర్హులు. భారతదేశం కాకుండా ఇతర దేశాల్లో యూజీ కోర్సులు చేస్తున్న, పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఎటువంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.

NEET 2021: నీట్ ఎగ్జామ్ వాయిదా పడుతుందా? క్లారిటీ ఇచ్చిన NTA.. వివరాలివే

ఈ సారి మార్పులివే..

గేట్​–2022లో పలు మార్పులు జరిగాయి. ఈ సారి కొత్తగా నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజినీరింగ్, జియోమాటిక్స్ ఇంజినీరింగ్ అనే రెండు పేపర్లను చేర్చారు. ఈ రెండు పేపర్లతో గేట్​ సబ్జెక్ట్​ పేపర్ల సంఖ్య 29కి చేరింది. అభ్యర్థులు వీటిలో ఒకటి లేదా రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. రెండు పేపర్లకు హాజరయ్యే విధానాన్ని గేట్​–2021 నుంచి అమలు చేస్తున్నారు.

First published:

Tags: Exams

ఉత్తమ కథలు