• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • GATE 2021 RESULT WILL BE ANNOUNCED ON MARCH 22 BY IIT BOMBAY ON THE OFFICIAL WEBSITE HERE FULL DETAILS NS

GATE 2021 Result: గేట్ ఫలితాల విడుదల తేదీ ప్రకటన.. వివరాలివే..

GATE 2021 Result: గేట్ ఫలితాల విడుదల తేదీ ప్రకటన.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ఫిబ్రవరి 6, 7, 13, 14 తేదీల్లో గేట్ 2021(GATE-2021) పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 27 పేపర్లతో ఈ పరీక్ష నిర్వహించారు. అయితే ఈ పరీక్ష ఫలితాలపై ఐఐటీ బొంబాయి తాజాగా కీలక ప్రకటన చేసింది.

  • Share this:
    ఫిబ్రవరి 6, 7, 13, 14 తేదీల్లో గేట్ 2021(GATE-2021) పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 27 పేపర్లతో ఈ పరీక్ష నిర్వహించారు. అయితే ఈ పరీక్ష ఫలితాలపై ఐఐటీ బొంబాయి తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ ఫలితాలను మార్చి 22న ప్రకటించనున్నట్లు తెలిపింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ gate.iitb.ac.in లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటికే ఫిబ్రవరి 26న ఆన్సర్ కీని అధికారులు విడుదల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు ఆన్సర్ కీని ఛాలెంజ్ చేసే అవకాశాన్ని కల్పించారు. అయితే ఆ ఛాలెంజ్ చేసే గడువు మే 4తో ముగిసింది.

    ఫలితాలు విడుదలైన అనంతరం అభ్యర్థులు ఈ స్టెప్స్ ను అనుసరించి రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు..
    -అభ్యర్థులు మొదటగా గేట్ అధికారిక వెబ్ సైట్ gate.iitb.ac.in ను ఓపెన్ చేయాలి.
    -అనంతరం ‘GATE 2021 result’ లింక్ పై క్లిక్ చేయాలి.
    -దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
    -అప్లికేషన్ ఐడీ, పాస్వర్డ్ ను నమోదు చేయాల్సి ఉంటుంది.
    -అనంతరం మన ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
    -అనంతరం రిజల్ట్ కాపీని ప్రింట్ తీసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published: